రామగుండం నగర అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రామగుండం నగర అభివృద్ధే లక్ష్యం

Aug 16 2026 12:33 AM | Updated on Aug 16 2026 12:33 AM

● మేయర్‌ మహంకాళి స్వామి

జ్యోతినగర్‌: రామగుండం నగర అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పుట్టినరోజు సందర్భంగా రెండోడివిజన్‌ నర్రాశాలపల్లెలో శనివారం కార్పొరేటర్‌ వెంగల బాపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్యతోపాటు కార్పొరేటర్లతో కలిసి పాల్గొని కేక్‌ కట్‌ చేసి, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్పొటర్‌ గట్ల రమేశ్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement