పెద్దపల్లి: ప్రజావాణిలో అందిన అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలు పరి ష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
విద్యపై ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపా టు నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సుల్తానాబాద్‌లోని పలు వి ద్యా సంస్థలను సందర్శించి సూచనలు చేశారు. అ నంతరం టీబీ నివారణపై సమీక్షించారు. 100రోజు ల టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో జిల్లాలో 100 శా తానికి పైగా స్క్రీనింగ్, నాట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంతో జాతీయస్థాయిలో అవార్డు లభించిందన్నారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్.. పెండింగ్ పనులపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళా శాల పరిశీలించారు. ఈఈ అశోక్‌కుమార్, డీఈవో శారద, జిల్లా ఇంటర్ అధికారి కల్పన పాల్గొన్నారు.
20 మంది సర్వేయర్ల లైసెన్స్‌లు రద్దు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేకు గైర్హాజరైన 20 మంది సర్వేయర్ల లైసెన్స్‌లు రద్దు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.


