కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గాజుల లస్మమ్మ గురు వారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలుకు ఇద్దరు కూతుళ్లు లక్ష్మి, రాధ, కుమారుడు శంకరయ్య, సుమారు 20 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు.
అనారోగ్యంతో
హెడ్‌కానిస్టేబుల్..
కాళేశ్వరం: జయశంకర్ భూపా లపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా వి ధులు నిర్వర్తిస్తున్న హనుమండ్ల కనుకయ్య (52) అనారోగ్య కా రణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరుగుతాయని పోలీసులు తెలిపారు. కనుకయ్య పదేళ్లుగా కాళేశ్వరంలోనే ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారు. అందరితో మర్యాద, కలివిడిగా ఉండేవాడని గుర్తు చేసుకుంటున్నారు.
భూ సమస్యకు పరిష్కారం
కాల్వశ్రీరాంపూర్: కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల అమృతమ్మ భూసమస్యను తహసీల్దార్ రాపెల్లి రాముడు భూపోర్టల్ ద్వారా శుక్రవారం పరిష్కరించారు. 347/ఏ/బి/సర్వే నంబర్‌లో 0.30 గుంటలను పట్టా చేయించుకునేందుకు దశాబ్దంగా తహసీల్దార్ కార్యాలయ చుట్టూ తిరిగి వేసారిపోయింది. భూభారతి పోర్టల్‌లో తహసీల్దార్లే సమస్య పరిష్కరిస్తున్నారనే సమాచారంతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న అమృతమ్మ.. సమస్యను తహసీల్దార్ రాముడుకు విన్నవించింది. దీంతో అమృతమ్మ పేరిట భూమి పట్టాచేసి సమస్యకు పరిష్కారం చూపారు. తహసీల్దార్‌ను ఆమె శాలువాతో సన్మానించింది.


