గోదావరిఖని: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం హెడ్‌ఆఫీస్ వద్ద ప్రారంభమైన ఆమరణ నిరాహార దీక్షకు ఐఎఫ్‌టీయూ మద్దతు ప్రకటిస్తుందని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.కృష్ణ తెలిపారు. శుక్రవారం యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి, సింగరేణి యాజమాన్యం మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు బాధితులు వెనక్కి తగ్గబోరని, ఉద్యోగం వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు చింతల శేఖర్, ఈదునూరి రామకృష్ణ, చింతల శేఖర్, రవికుమార్, ఇర్ఫాన్, పోగుల శేఖర్, ప్రభాకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


