చోరీ కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

● వివరాలు వెల్లడించిన డీసీపీ రాంరెడ్డి

పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో ఈనెల 14న జరిగిన చోరీ కేసులో నిందితుడు మేడం కరుణాకర్‌ను సోమవారం అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. బసంత్‌నగర్‌ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన పోతురాజుల చొక్కయ్య, కుటుంబసభ్యులు పొలం పనులకు వెళ్లగా.. ధర్మా రం మండలం కమ్మర్‌ఖాన్‌పేటకు0 చెందిన కరుణాకర్‌.. తాళం తీసి ఇంట్లో చొరబడి బీరువా పగుల గొట్టి నాలుగున్నర తులాల బంగారం, 18తులాల వెండితోపాటు రూ.3వేల నగదును చోరీచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన రోజు ఆ ఊరులో కనిపించినట్లు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. దీంతో కరుణాకర్‌ను పోలీసులు సెల్‌ఫోన్‌లో సంప్రదించగా.. ఫోన్‌ స్విచ్ఛాప్‌ వచ్చింది. దీంతో కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు. ధర్మారం క్రాస్‌రోడ్డు వద్ద కరుణాకర్‌ ఉన్నాడనే సమాచారం మేరకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి నల్లపూసల తాడు, ఒకజత కమ్మలు, బుట్టాలు, ఒకజత మాటీలు, ఉంగరంతోపాటు వెండి కడియం, రూ.3వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌, కారు తాళం చెవిని స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, రామగుండం సీఐ కృషష్ణకుమార్‌, బసంత్‌నగర్‌ ఎస్సై శ్రీధర్‌ను డీసీపీ అభినందించారు. కానిస్టేబుళ్లు అనిల్‌, శ్రీనివాస్‌కు నగదు రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement