సుల్తానాబాద్‌రూరల్: కస్లమ్ రైస్ మిల్లింగ్(సీఎమ్మార్)ను ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించిన కేసులో ఇద్దరు రైస్‌మిల్లు యాజమానులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసుస్టేషన్‌లో సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. సుల్తానాబాద్ పరిధిలోని ఓ రైస్‌మిల్లుకు 2023–24 సంవత్సరానికి గాను 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించారు. అందులో 6,662 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అయితే, 5,020 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ ఉండగా, ధాన్యం కూడా నిల్వలేదని ఈనెల 6న సివిల్ సప్లయ్ అధికారులు చేసిన తనిఖీల్లో గుర్తించారు. పక్కదారి పట్టిన సీఎమ్మార్ విలువ రూ.24.18 కోట్లు ఉంటుంది. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శ్రీకాంత్ సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రైస్‌మిల్లు యాజమానులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన మధు, రవీందర్‌రెడ్డిని అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ వివరించారు. కేసును ఛేదించిన ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ రంజిత్‌రావు, ఎస్సై చంద్రకుమార్‌ను డీసీపీ అభినందించారు. రివార్డుకు సిఫారసు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు.


