పాతతరం ఆలోచన విధానం మారాలి. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటితోనే కుటుంబాల్లో చిచ్చు రేగి విధ్వంసాలకు కారణమవుతున్నాయి. ఈ పద్దతి పూర్తిగా మారాలి.
– హర్షిత, పెద్దపల్లి
సమాజంలోని అసమానతలకు స్వస్తి పలికి 2047 కల్లా సమానత్వం సాధిస్తాం. 1947నాటి స్వాతంత్య్రం ఓ చరిత్ర. వందేళ్ల తర్వాత 2047 కల్లా భారతావని గడ్డ గ్లోబల్‌టెక్ హబ్‌గా మారుతుందనే నమ్మకం ఉంది.
– ఇమ్రాన్, పెద్దపల్లి
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ) సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వందేళ్ల స్వతంత్ర భారతం విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా సొంతంగానే ఏఐ మోడల్స్‌తో గ్లోబల్ టెక్ హబ్‌గా మారాలి.
– రాహుల్, విద్యార్థి, పెద్దపల్లి
1947 నాటి పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. 2047 వరకు అంతా డిజిటల్ యుగమే. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నయ్. వ్యవహారాలన్నీ డిజిటల్ రూపంలోనే జరగనున్నాయి.
– శివ, విద్యార్థి, పెద్దపల్లి


