గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో శు క్రవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు జా తీయ జెండాలు చేత పట్టుకుని దేశభక్తి నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, ల క్ష్మీనర్సయ్య, పద్మ, అపర్ణ, వెంకటరమణ, జన గామ భూమయ్య, సుభాష్, స్వామి, బాలు, కల్యాణ్, బియ్యాల మహేందర్, రాజ్‌కుమార్, నరేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
త్రివర్ణ పతాకం ప్రదర్శన
జ్యోతినగర్: ఎన్టీపీసీ పీటీఎస్‌లో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ప్రదర్శనను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, దీప్తి మహి ళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత ప్రారంభించారు. త్రివర్ణ పతాకం, భారతదేశ స్వాతంత్య్ర ప్రస్థానం, జాతీయ గుర్తింపును తెలియజేసే అంశాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయని సామంత పేర్కొన్నారు.
సీఐఎస్‌ఎఫ్ ‘హర్ ఘర్ తిరంగా’
జ్యోతినగర్: ఎన్టీపీసీలో సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా యాత్ర (బైక్ ర్యాలీ) నిర్వహించారు. ప్రాజెక్టు లేబర్ గేట్‌లో సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ నవనీత్ కౌర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జాతీయ జెండాలతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. సుమారు 50 బైక్‌లపై 100 మంది పాల్గొని జాతీయ జెండాలతో దేశభక్తి చాటారు. కార్యక్రమంలో రామగుండం సీఐ కృష్ణకుమార్, ట్రాఫిక్ ఎస్సై హరిశేఖర్, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరణ
మంథని: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యవిధాన పరిషత్ చేపట్టిన నియామకాల్లో భాగంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో జనరల్ సర్జన్ నికీల్ తేజ శుక్రవారం విధుల్లో చేరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ టీవీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ నికీల్‌తేజ విధుల్లో చేరడంతో పట్టణంతో పాటు పరిసర మండలాల ప్రజలకు శస్త్రచికిత్స సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయన్నారు. అవసరమైన సందర్భాల్లో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నామని, ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
డయాగ్నొస్టిక్ సెంటర్ తనిఖీ
పెద్దపల్లి: అర్హులైన నిపుణులు ఉంటేనే డయాగ్నొస్టిక్ సెంటర్ తెరవాలని జిల్లా వైద్యాధికారి పవిత్ర సూచించారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో జిల్లా కేంద్రంలో ఓ డయాగ్నొస్టిక్‌ను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. డాక్టర్ లేకుండా పరీక్షలు చేయడాన్ని తప్పుపట్టారు. సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఇదే విధానం పునరావృతమైతే సెంటర్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.
తప్పడు ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ.10వేల జరిమానా
పెద్దపల్లి: లోకాయుక్తలో అధికారులపై తప్పుడు ఫిర్యాదు చేసిన రాఘవాపూర్ గ్రామానికి చెందిన బొబ్బిలి సత్యనారాయణకు రూ.10వేల జరిమానా విధించినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలిపారు. రాఘవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అనుమతులు లేవన 2023 జనవరి 2న లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపిన అధికారులు లోకాయుక్తకు నివేదిక సమర్పించారని, పరిశీలించిన అనంతరం బొబ్బిలి సత్యనారాయణ చేసిన ఫిర్యాదు నిరాధారమైనదని, వేధింపులకు ఉద్దేశించినదని లోకాయుక్త కొట్టివేసిందని ఆయన వివరించారు.


