ఏడో తేదీలోగా వేతనాలు | - | Sakshi
Sakshi News home page

ఏడో తేదీలోగా వేతనాలు

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

సైకిళ్లు పంపిణీ చేస్తున్న మంత్రి అడ్లూరి, కలెక్టర్‌ శ్రీహర్ష, విద్యార్థుల సమక్షంలో కేక్‌ కట్‌చేస్తూ..

ధర్మారం: సంక్షేమ గురుకులాల అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌కు ప్రతీనెల ఏడో తేదీలోగా వేతనాలు చెల్లించేలా చర్య లు తీసుకున్నట్లు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ చెప్పారు. స్థానిక గిరిజన మినీ గురుకుల విద్యాలయంలో బు ధవారం అదనపు గదుల నిర్మాణానికి కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. రాష్ట్రంలోనే తొలిసారి విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. అనంతరం ప్రభుత్వ భూము లు పరిశీలించారు. కాంగ్రెస్‌ నాయకుడు జంగ మ హేందర్‌యాదవ్‌ మంత్రి చేతుల మీదుగా వి ద్యార్థులకు పుస్తకాలు, ఇతర వస్తువులు పంపి ణీ చేయించారు. మంత్రి మాట్లాడుతూ, వి ద్యార్థులకు వసతులు కల్పిస్తామన్నారు. ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రతిపాది స్తే ప్రభుత్వం నుంచి అనుమతులు జారీ చే స్తామని అభయం ఇ చ్చారు. వైఎస్సార్‌ హ యాంలో ఇంటర్మీడియ ట్‌ కళాశాల తీసుకొచ్చానని, ప్రస్తుత సీఎం రే వంత్‌రెడ్డి సహకారంతో ఐటీఐ మంజూరు చే యించానని గుర్తుచేశా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వి ద్యార్థుల కోసం ధర్మపు రికి మంజూరైన ఇంటిగ్రేటెడ్‌ విద్యాలయానికి 35 ఎకరాలు కేటాయించామని, మూడేళ్లలో పూర్తిచేసి విద్యార్థులకు బోధన ప్రారంభిస్తామని చెప్పారు. గిరిజన విద్యా ర్థులకు నాణ్యమైన విద్య అందించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఏప్రిల్‌, మేలో భవనాలకు అవసమైన మరమ్మతులు పూర్తిచేయిస్తామన్నారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ, రెండేళ్లలోనే మినీ గురుకు లం రూపురేఖలు మారిపోయాయన్నారు. మంత్రి ఆదేశాల మేరకు డైనింగ్‌హాల్‌, డార్మెటరీలో పడకలు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఏఎంసీ చైర్మన్‌ రూప్లానాయక్‌, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సంగ రంజిత్‌, సర్పంచులు ఆవుల మల్లయ్య, వేల్పుల రేవతి –నాగరాజు, భూక్య సంగీత – ఆంజనేయులు, కూస శ్రీవాణి – తిరుపతి, కల్లెం గంగారెడ్డి, చేపూరి లచ్చయ్య, మ్యాడారం వీర్‌పాల్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహం, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అసోద అజయ్‌, మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌లు పాలకుర్తి రాజేశంగౌడ్‌, కాడే సూర్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

సోషల్‌ వెల్ఫేర్‌ సిబ్బందికి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

ధర్మారం మినీ గురుకులాన్ని టెన్త్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేస్తాం

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement