పరిశీలిస్తూ.. పరిష్కరిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

పరిశీలిస్తూ.. పరిష్కరిస్తూ..

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

డివిజన్‌ బాటకు శ్రీకారం చుట్టిన మేయర్‌ మహంకాళి స్వామి

కోల్‌సిటీ: రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి బుధవారం డివిజన్‌ బాటకు శ్రీకారం చుట్టారు. స్థానిక 3వ డివిజన్‌లోని ప్రశాంత్‌ నగర్‌, వినాయకనగర్‌, దొడ్డి కొమురయ్యనగర్‌, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్‌ వడ్లూరి రవి, అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమస్యలపై ఆరా తీస్తూ ముందుకు సాగారు. స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆయన సూచన మేరకు అధికారులు.. శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మురుగునీటి కాలువల్లో యంత్రాలతో పూడిక తొలగించారు. సుమారు 10 వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి సరఫరాలో సమస్యలనూ పరిష్కరించారు. నివాసాలపై వేలాడుతున్న కరెంట్‌ తీగలను సవరించాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. కాలువల్లో చెత్త పడవేస్తున్నారనే ఫిర్యాదు మేరకు హోటల్‌ నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్‌, డీఈఈ మనోజ్‌, చంద్రమౌళి, రాంజీ, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ అధికారులు మౌనిక, కిశోర్‌, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగ భూషణం, సంపత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement