● 15లోగా హెచ్‌ఎల్‌బీ నిర్ధారణ పూర్తి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: జిల్లాలో జనగణన – 2027 పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. హౌస్‌లి స్టింగ్ బ్లాక్(హెచ్‌ఎల్‌బీ) నిర్ధారణ ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తిచేయాలన్నారు. జనగణన –2027పై సంబంధిత అధికారులు, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ బ్లాక్ మే 10న ప్రారంభమవుతుందని, ప్రతీ 300 ఇళ్ల, 800 జనాభాను ఒకబ్లాక్‌గా హెచ్‌ఎల్‌బీ నిర్దేశించి వివరాలు సేకరిస్తామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెచ్‌ఎల్‌బీ పరిధిలోని నివాసాలు, ఆలయాలు, ఇతర ప్రార్థనామందిరాలు, ఆటస్థలాలు, ఆస్పత్రులు తదితర వివరాలు పకడ్బందీగా సేకరించాలని సూచించారు. జనగణన చాలాముఖ్యమైన అంశమని, నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. హౌస్ లిస్టింగ్ కోసం జిల్లావ్యాప్తంగా 1,400 మంది ఎన్యూమరేటర్లు అవసరం ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
హింసకు గురయ్యే మహిళలకు సఖి సేవలు
హింసకు గురవుతున్న మహిళలకు సఖి సెంటర్ ద్వారా సేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. రంగంపల్లిలోని సఖి సెంటర్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని, కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని న్యాయ సలహా అందించాలని సూచించారు.


