సమ్మక్క హుండీ ఆదాయం రూ.9.51 లక్షలు | - | Sakshi
Sakshi News home page

సమ్మక్క హుండీ ఆదాయం రూ.9.51 లక్షలు

Feb 4 2026 7:03 AM | Updated on Feb 4 2026 7:03 AM

సమ్మక

సమ్మక్క హుండీ ఆదాయం రూ.9.51 లక్షలు

రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క – సారలమ్మ జాతర హుండీల ఆదా యాన్ని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.9,51,287 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. వీటితో పాటు 206 గ్రాముల మిశ్రమ వెండి, 0.380 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం సమకూరిందని వారు వివరించారు. టికెట్లు, టెండర్ల ద్వారా సమకూరిన ఆదాయం ఇందులో పేర్కొనలేదు. దీనిపై ఈవో రాజ్‌కుమార్‌ను సంప్రదించేందుకు యత్నించగా స్పందించలేదు. జాతర కమిటీ చైర్మన్‌ గీట్ల శంకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నరేందర్‌, ప్రతినిధులు బాలసాని సత్తయ్య, ఆవుల గోపాల్‌యాదవ్‌, కోల రామ్మూర్తిగౌడ్‌, పల్లికొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి తప్పనిసరి

గోదావరిఖని: రామగుండం పోలీసు కమిషనరేట్‌లో అ నుమతిలేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, స భలు, సమావేశాలునిర్వహించరాదని సీపీ అంబర్‌ కిశోర్‌ఝా స్పష్టం చేశారు. అత్యవసరమైతే ముందుగా పోలీస్‌ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. బహి రంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయని, అనుమతిలేకుండా డ్రోన్‌ లు, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కమిషనరేట్‌లో ఈనెల ఒకటినుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందన్నారు.

ఆరేళ్ల సమస్యకు పరిష్కారం

జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆరేళ్లుగా కొనసాగుతున్న లో వోల్టేజీ సమస్యకు ట్రాన్స్‌కో అధికారులు పరిష్కారం చూపుతున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మ ర్‌ ఏర్పాటుకు రూ.2,34,892 విలువైన డీడీలు చెల్లించినా ట్రాన్స్‌కో కార్యాలయంలో నిర్లక్ష్యంగా వాటిని మూలన పడేశారు. స్థానికుడు, ధర్మారం ఏడీఈ విజయ్‌పాల్‌సింగ్‌ ఇటీవల ఇక్కడ పర్యటించగా.. డీడీల విషయం వెలుగుచూసింది. దీంతో ఆయన ట్రాన్స్‌ఫార్మర్‌, తీగలు, స్తంభాలు మంజూరు చేశారు. ఆయన సూచనలతో కళాశాలలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మ ర్‌ ఏర్పాటుకు సిబ్బంది మంగళవారం పనులు ప్రారంభించారు. అధ్యాపకులు, గ్రామస్తులు, విద్యార్థులు ఏడీఈకి కృతజ్ఞతలు తెలిపారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,811

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,811 ధర పలికింది. కని ష్టంగా రూ.6,016, సగటు రూ.7,512 గా ధర నమోదైందని మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి ప్ర వీణ్‌రెడ్డి తెలిపారు. మొత్తం 529 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

కమిటీలు ఏర్పాటు చేయాలి

పెద్దపల్లి: పది మంది, అంతకుమించి మహిళలు పనిచేస్తున్న ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు సూచించారు. జిల్లాలోని ప్ర భుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో కచ్చితంగా కమిటీ లు వేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా http:// shebox.tgwdcw.in వెబ్‌సైట్‌లో వివరాలు న మోదు చేయాలని ఆయన సూచించారు.

4 వారాలు.. 28 రోజులు

పెద్దపల్లిరూరల్‌: ఈఏడాది ఫిబ్రవరి నెలకు ప్ర త్యేకత ఉంది. ఈనెల పౌర్ణమి (ఫిబ్రవరి1)తో మొదలవుతోంది. అంతేకాదు.. ఈనెలలో వ చ్చే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం.. ఇలా అన్నిరోజులూ సమానంగా.. నాలుగేసిచొప్పున ఉండడమే విశేషం. ఇలాంటి అద్భుతమైన మాసం 823 ఏళ్ల తర్వాత వచ్చిందని వేదపండితుడొకరు వివరించారు.

సమ్మక్క హుండీ   ఆదాయం రూ.9.51 లక్షలు 1
1/3

సమ్మక్క హుండీ ఆదాయం రూ.9.51 లక్షలు

సమ్మక్క హుండీ   ఆదాయం రూ.9.51 లక్షలు 2
2/3

సమ్మక్క హుండీ ఆదాయం రూ.9.51 లక్షలు

సమ్మక్క హుండీ   ఆదాయం రూ.9.51 లక్షలు 3
3/3

సమ్మక్క హుండీ ఆదాయం రూ.9.51 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement