భార్యాభర్తలు.. వేర్వేరు డివిజన్లు | - | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలు.. వేర్వేరు డివిజన్లు

Feb 4 2026 7:03 AM | Updated on Feb 4 2026 7:03 AM

భార్య

భార్యాభర్తలు.. వేర్వేరు డివిజన్లు

జ్యోతినగర్‌: రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికల్లో భార్యాభర్తలు వేర్వేరు డివిజన్లలో పోటీ చేస్తున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్టీపీసీ ప్రాంతంలోని 34వ డివిజన్‌లో భార్య పొన్నం సుమలత, రెండోడివిజన్‌లో భర్త పొన్నం విజయ్‌గౌడ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన బరిలో నిలిచారు. దీంతో వారు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు.

యూరియా ఉత్పత్తిలో కీలకం

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): దేశీయంగా ఎరువుల ఉత్పత్తిలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కీలకపాత్ర పోషిస్తోంది. ప్లాంట్‌ రోజూవారి సామర్థ్యం 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా. వార్షిక ఉత్పత్తి లక్ష్యం 12.7 లక్షల మెట్రిక్‌ టన్నులు. ప్రస్తుతం 90శాతం సామర్థ్యంతో ఉత్పత్తి సాగుతోంది. జనవరిలో 1,08,002.32 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో తెలంగాణకు 50.5 శాతం యూరియా కేటాయించారు. మిగతా యూరియాలో ఆంధ్రప్రదేశ్‌కు 23,165.82 మెట్రిక్‌ టన్నులు, కర్ణాటకకు 19,506.78 మెట్రిక్‌ టన్నులు, మహారాష్ట్రకు 5,225.22 మెట్రిక్‌ టన్నులు, తమిళనాడుకు 2,629.53 మెట్రిక్‌ టన్నులు కేటాయించినట్లు అధికారులు వివరించారు.

భార్యాభర్తలు.. వేర్వేరు డివిజన్లు1
1/1

భార్యాభర్తలు.. వేర్వేరు డివిజన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement