కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్‌లు
గోదావరిఖని/రామగుండం: రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ మంగళవారం బీఫామ్‌లు అందజేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 60 డివిజన్ల నుంచి పోటీపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేశారు. తొలుత స్థానిక పవర్‌హౌస్‌కాలనీ శివాలయం, రామగుండం అంజనాద్రిగుట్టపై ఉన్న శ్రీధనుర్భానారామాంజనేయస్వామి ఆలయంలో బీఫామ్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి శివుడు, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.


