ప్రభుత్వ లక్ష్య సాధనకు తోడ్పాటు అందించాలి
పెద్దపల్లి: బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్య సాధనలో తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవంతంగా సాగుతున్న ఇందిరా మహిళాశక్తి వ్యాపారాలకు మరిన్ని రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. 2025–26లో పంట రుణాలు రూ.1,916 కోట్లకు రూ.1,471 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.651 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. 5,111 స్వశక్తి సంఘాలకు రూ.361 కోట్ల 60 లక్షల బ్యాంక్ రుణాలు అందించామని తెలిపారు. మెప్మా నిర్దేశించిన లక్ష్యం కన్నా 494 సంఘాలకు రూ.63 కోట్ల 2 లక్షల రుణాలు అధికంగా పంపిణీ చేశామన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వా రా రూ.8 కోట్ల 57 లక్షల సబ్సిడీతో 119 యూనిట్లు, స్టాండ్‌అప్ ఇండియా ద్వారా రూ.5కో ట్ల 17 లక్షల రాయితీతో 57 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ముద్ర రుణాల ద్వారా 14,718 మందికి రూ.173 కోట్లు అందించామని అన్నారు. చిన్న ఆహార శుద్ధి కేంద్రాల కో సం వచ్చిన 74 దరఖాస్తులను ఆమోదించి రుణా లు పంపిణీ చేశామని, మరో 37 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా 1,270 మందికి రూ.11 కోట్ల 43 లక్షల రుణాలు పంపిణీ చేశామన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష
బ్యాంకర్లతో సమావేశం


