ఇక సమరమే | - | Sakshi
Sakshi News home page

ఇక సమరమే

Feb 4 2026 7:03 AM | Updated on Feb 4 2026 7:03 AM

ఇక సమరమే

ఇక సమరమే

సాక్షి పెద్దపల్లి:

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. పోటీలో నిలిచిన వారిజాబితా ప్రకటన, గుర్తుల కేటాయింపు పూర్తికావడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో పనులు ప్రారంభించారు. అన్నివార్డుల్లోనూ ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీఉంది. కొందరు తమకు కేటాయించిన గుర్తులతోపాటు తమ ఫొటోలు ఉండేలా పెద్ద బ్యానర్లు సిద్ధంచేసి వార్డుల్లోని ప్రధాన కూడ ళ్లు, కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు.

124 వార్డులు/డివిజన్లు.. బరిలో 581 మంది

రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు 452 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఉపసంహర ణ అనంతరం315 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి మున్సిపల్‌లో 36 వార్డులకు 194మంది నామినేషన్లు వేయగా, 37మంది విత్‌డ్రా చేసుకున్నారు. 157 మంది బరిలో నిలిచారు. సుల్తానాబాద్‌లో 15 వార్డులకు 75 మంది నామినేషన్లు వేయగా..14మంది విత్‌డ్రా అయ్యారు. 61మంది బరిలో ఉన్నా రు. మంథనిలో 13 వార్డులకు 107 మంది దరఖా స్తు చేయగా 55 మంది ఉపసంహరించుకున్నారు. 48 మంది పోటీలో మిగిలారు. పెద్దపల్లిలో 36 వార్డులకు బీజేపీ నుంచి 26 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 35 మంది బరిలో ఉండగా, మంథనిలో 13వా ర్డులకు బీజేపీ తరఫున 12మంది పోటీచేస్తున్నారు.

గుర్తులతో ప్రచారంపై ఫోకస్‌

అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతోపాటు ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేసే పనుల చిట్టాను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. వార్డులు/డివిజన్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకుంటున్న వాట్సాప్‌ గ్రూప్‌లను ఇందుకు వేదికగా చేసుకుని ఆన్‌లైన్‌ ప్రచారం హోరెత్తిస్తున్నారు. కొందరు రీల్స్‌ సైతం చేస్తూ కౌన్సిలర్‌, కార్పొరేటర్‌గా గెలుపు కోసం విభిన్న పంథాలు అనుసరిస్తున్నారు. దీంతో మున్సిపల్‌ పోరు రసవత్తరంగా మారింది. ఇతర ప్రాంతాల్లోని తమవార్డు ఓటర్లకు వాట్సాప్‌ ద్వారా నే తమగుర్తు, హామీలను పంపుతూ ఓట్లు అభ్యరి స్తున్నారు. మరో ఆరురోజుల సమయమే మిగిలి ఉండడంతో తమ బంధుగణంతోపాటు స్నేహితులతో గెలుపు మంతనాలు చేస్తున్నారు. కులాలు, యూత్‌ అసోసియేషన్ల వారీగా హామీలు గుప్పిస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

టికెట్‌ ఖరారు.. ప్రచారం షురూ

గల్లీల్లో హోరెత్తించేలా ప్రణాళిక

124 స్థానాల్లో 581 మంది అభ్యర్థులు

స్వతంత్ర అభ్యర్థులుగా అసంతృప్తి నేతలు

బరిలో నిలిచిన అభ్యర్థులు

బల్దియా వార్డులు అభ్యర్థులు

రామగుండం 60 315

పెద్దపల్లి 36 157

మంథని 13 48

సుల్తానాబాద్‌ 15 61

మొత్తం 124 581

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement