కూడికలు.. తీసివేతలు
గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా 315 మంది పోటీ పడుతున్నారు. ఒక్కో డివిజన్‌లో అత్యల్పంగా ఇద్దరు, అత్యధికంగా 13 మంది నువ్వానేనా అంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతోపాటు ఏఐఎఫ్‌బీ, సీపీఐ, సీపీఎం అభ్యర్థులు విజయం ఎలా సాధించాలనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఒక్కో డివిజన్‌లో అతితక్కువగా 2,300 మంది ఓటర్లు ఉంటే.. మరో డివిజన్‌లో అత్యధికంగా 4,210 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నచోట కొద్దిగా శ్రమిస్తే విజయం ఖాయమనే ధీమాతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. కొన్నిఓట్లను సాధించినా గెలుస్తామంటూ కూ డికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు.
60 డివిజన్లు.. 1.83లక్షల మంది ఓటర్లు..
నగరంలోని 60 డివిజన్లలో మొత్తం 1,83,049 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 91,441 మంది పురుషులు, 91,578మంది మహిళలు మిగతావారు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 22వ డివిజన్‌లో అత్యల్పంగా 2,085 మంది ఓటర్లు ఉంటే.. 42వ డివిజన్‌లో అత్యధికంగా 4,210 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఎక్కడ పోటీలో ఎక్కువ మంది ఉంటే అక్కడ విజయం సులభం అవుందనే భావనతో అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేస్తున్నారు. 13, 15, 31 డివిజన్లలో ఇద్దరేసి అభ్యర్థులే పోటీపడుతున్నారు. 48వ డివిజన్‌లో 13మంది పో టీ పడుతున్నారు. 13, 15, 31వ డివిజన్లలో గెలుపు అంత సులభం ఏమీకాదని, అత్యధికంగా 13మంది పోటీపడుతున్న 48వ డివిజన్‌లో కొద్దిమంది ఓటర్లు దయచూపితే విజయం ఖాయమనే ధీమాతో అభ్య ర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఈనెల 13న వారి భవితవ్యం ఏమిటో తేలనుంది.
గోదావరిఖని నగరం
స్వల్ప మెజారిటీ వచ్చినా గెలిచే అవకాశాలు
కొన్నిచోట్ల అత్యధిక మంది పోటీచేయడమే కారణం
మెజారిటీ ఓటింగ్‌పై దృష్టి సారిస్తున్న అభ్యర్థులు
కూడికలు.. తీసివేతలు


