టిక్‌..టిక్‌..టిక్‌.. | - | Sakshi
Sakshi News home page

టిక్‌..టిక్‌..టిక్‌..

Feb 13 2026 5:26 AM | Updated on Feb 13 2026 5:26 AM

టిక్‌

టిక్‌..టిక్‌..టిక్‌..

న్యూస్‌రీల్‌

కాంగ్రెస్‌: రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ

బీఆర్‌ఎస్‌: మెట్‌పల్లి, రాయికల్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, సిరిసిల్ల

బీజేపీ: కరీంనగర్‌, వేములవాడ

కమిషనర్‌ అరుణశ్రీ

ఒకచోట 46, మరో చోట 87 శాతం

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సింగరేణిలో సమ్మె ప్రశాంతం

గోదావరిఖని(రామగుండం): దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో గురువారం చేపట్టిన సమ్మె ప్రశాంతంగా జరిగింది. కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు సంఘీభావం పలికారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1,2,3, ఏపీఏ ఏరియాల్లో కార్మికుల హాజరుశాతం తగ్గింది. సమ్మె వల్ల ఉత్పత్తికి విఘాతం కలగకుండా ఓసీపీల్లో యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. కోల్‌బెంచ్‌ నుంచి బొగ్గును కొద్దిమందితో సీహెచ్‌పీలకు తరలించారు. సమ్మెతోనైనా కేంద్రం బుద్ధి తెచ్చుకుని నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ నాయకులు చేశారు. తుమ్మల రాజారెడ్డి, రియాజ్‌అహ్మద్‌, ఐ.కృష్ణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఆర్జీ–3లో ఫారెస్ట్‌ నోడల్‌ ఆఫీసర్‌ పర్యటన

రామగిరి: ఆర్జీ–3 ఏరియాలో గురువారం ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌, నోడల్‌ ఆఫీసర్‌ సి.శరవణన్‌ పర్యటించారు. ముందుగా రామగిరి అతిథి గృహం నందు ఆర్జీ–3, ఎస్టేట్‌, మందమర్రి జీఎంలు సుంకర మధుసూదన్‌, టి.లక్ష్మీపతిగౌడ్‌, ఎన్‌.రాధాకృష్ణ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్‌ ఓసీపీ గని కోసం ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 ఉపరితల గని పరిధిలోని ఓబీ డంపునకు కేటాయించిన 102 హెక్టార్ల (సీఏ ల్యాండ్‌) భూమిని ప్రభుత్వం అటవీశాఖకు అప్పగించడానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించగా జీఎంలు పూర్తి వివరాలు తెలియజేశారు. ఆయన వెంట అటవీశాఖ డిప్యూటీ చీఫ్‌ కన్జర్వేటర్‌ డాక్టర్‌ డి.సంహిత, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ నవీన్‌, సింగరేణి ఫారెస్ట్రీ అడ్వైజర్‌ ఫర్గెన్‌, కాళేశ్వరం అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ డాక్టర్‌ బి.ప్రభాకర్‌ , జిల్లా ఫారెస్ట్‌ అధికారి శివయ్య, ఎఫ్‌ఆర్‌వోలు పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూం పరిశీలన

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ కృష్ణ తెలిపారు. సుల్తానాబాద్‌లోని జూనియర్‌ కాలేజీలో స్ట్రాంగ్‌ రూం గురువారం పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఐ సుబ్బారెడ్డి ఎస్సైలు చంద్రకుమార్‌, అశోక్‌రెడ్డి ఉన్నారు.

కుష్టువ్యాధిపై అవగాహన

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): కుష్టువ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే నివారించవచ్చని జిల్లా పారామెడికల్‌ ఆఫీసర్‌ దేవిసింగ్‌ తెలిపారు. గురువారం మండలంలోని పెగడపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. శరీంపై మొద్దుబారిన మచ్చలు రాగిరంగులో ఉంటే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి సోకినవారికి ఉచితంగా మందులు పంపిణీ చేసి చికిత్స అందించనునట్లు పేర్కొన్నారు. హెచ్‌ఈవో ఆరెల్లి లక్ష్మణ్‌, ఏఎన్‌ఎంలు శోభ తదితరులు పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,421

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మార్కెట్‌యార్డు ఆవరణలో గురువారం పత్తి క్వింటాల్‌ గరిష్ట ధర రూ.7,421 పలికింది. కనిష్ట ధర రూ. 5,731, సగటు ధర రూ.7,181 ఉందని మార్కెట్‌ కమిటీ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. 850 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

మ్మడి కరీంనగర్‌ జిల్లా మున్సిపల్‌ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరగగా, ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. రెండు కార్పొరేషన్లలో 126 డివిజన్లకు, 13 మున్సిపాలిటీలలో 341 వార్డుల ఫలితాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్‌ జిల్లాలో 764, జగిత్యాల 655, పెద్దపల్లి 580, సిరిసిల్ల 287 మొత్తం 2,286 మంది భవితవ్యం నేడు తేలనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రధాన పార్టీల్లో లెక్కలు మొదలయ్యాయి. ఎగ్జిట్‌ ట్రెండ్స్‌ ప్రకారం ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశముందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐదు చోట్ల బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం కనిపిస్తుండగా, రెండు చోట్ల బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరో వైపు ఎనిమిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు సునా యాస విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్యాంపు రాజకీయాలు..

ఫలితాలు వెలువడగానే క్యాంపు రాజకీయాలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీల నేతలు ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో ముందస్తు ఒప్పందాలకు సిద్ధమవుతున్నారు. హంగ్‌ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రతి ఒక్క కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ ఓటు కీలకంగా మారనుంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ కొన్నిచోట్ల అభ్యర్థులను గురువారమే క్యాంపునకు తరలించింది. రామగుండం, మంథని, సుల్తానాబాద్‌, పెద్దపల్లి, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి, వేములవాడలో అభ్యర్థులను క్యాంపుకు రావాలని ఆదేశాలిచ్చింది. బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా కరీంనగర్‌, రామగుండం, సిరిసిల్ల, హుజురాబాద్‌, జమ్మికుంట, మెట్‌పల్లి, రాయికల్‌లో క్యాంపు రాజకీయానికి తెరలేపా రు. కరీంనగర్‌, వేములవాడలో క్యాంపు కోసం బీజే పీ అభ్యర్థులను సిద్ధంగా ఉండాలని సూచించింది.

తారుమారు కానున్న స్థానిక రాజకీయం

ఈ పుర ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రంగా మారే అవకాశముంది. అధికార పార్టీలు తమపట్టును నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉండగా, ప్రతిపక్షాలు బలమైన ప్రాతినిథ్యం సాధించి భవిష్యత్‌ ఎన్నికలను శాసించేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి, శుక్రవారం వెలువడే ఫలితాలు కేవలం మున్సిపల్‌ పాలనకే కాదు, జిల్లాలో భవిష్యత్‌ రాజకీయ దశ, దిశను నిర్ణయించనున్నాయి. అధికార కుర్చీ కోసం జరుగుతున్న ఈ పోరు ఉమ్మడి రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

పెద్దపల్లిలోని కౌంటింగ్‌ హాల్‌లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

క్యాంపునకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌లో ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే రాజకీయ వేడి మరింత పెరిగింది. మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడంపై ప్రధాన పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ముందస్తు ప్యూహాలకు శ్రీకారం చుట్టింది. గెలుపోటములపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థులను సమీకరించేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. కాగా, వివిధ డివిజన్ల నుంచి బీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేసిన అభ్యర్థులను గురువారం రాత్రి గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ నుంచి క్యాంపునకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా చందర్‌ మాట్లాడుతూ, కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లలో బీఆర్‌ఎస్‌కు 30 నుంచి 35 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ముందుజాగ్రత్తగా క్యాంపునకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం కొందరిని హైదరాబాద్‌ తరలించగా, శుక్రవారం ఫలితాల ఆధారంగా మరికొందరిని క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్ల్లడించారు.

పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సి పాలిటీల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాటు చే శారు. ఆయా మున్సిపాల్టీల్లోని పలు వార్డుల్లో ఎక్కువగా మహిళలే ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలుపోటములను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు.

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపిక

ముత్తారం(మంథని): మండలంలోని ధర్యపూర్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి చిరు వెంకటప్రసాద్‌ రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి మహబూబ్‌నగర్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటాడు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభచాటాడు.

నేడే బల్దియా ఎన్నికల ఫలితాలు

నాలుగు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి

13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో

5 చోట్ల బీఆర్‌ఎస్‌కు, రెండు చోట్ల బీజేపీకి సానుకూలత

8 చోట్ల కాంగ్రెస్‌కు సునాయాస విజయం

క్యాంపు రాజకీయాలకు సిద్ధమైన ప్రధానపార్టీలు

ఇండిపెండెంట్లతో పార్టీల ముందస్తు ఒప్పందాలు

మధ్యాహ్నంలోగా 126 డివిజన్లు, 341 వార్డుల రిజల్ట్స్‌

తేలనున్న 2,286 మంది భవితవ్యం

పార్టీలకు సానుకూలత ఇక్కడే..

టిక్‌..టిక్‌..టిక్‌..1
1/7

టిక్‌..టిక్‌..టిక్‌..

టిక్‌..టిక్‌..టిక్‌..2
2/7

టిక్‌..టిక్‌..టిక్‌..

టిక్‌..టిక్‌..టిక్‌..3
3/7

టిక్‌..టిక్‌..టిక్‌..

టిక్‌..టిక్‌..టిక్‌..4
4/7

టిక్‌..టిక్‌..టిక్‌..

టిక్‌..టిక్‌..టిక్‌..5
5/7

టిక్‌..టిక్‌..టిక్‌..

టిక్‌..టిక్‌..టిక్‌..6
6/7

టిక్‌..టిక్‌..టిక్‌..

టిక్‌..టిక్‌..టిక్‌..7
7/7

టిక్‌..టిక్‌..టిక్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement