భట్టి గారు.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

భట్టి గారు.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

● ‘సాక్షి’ కథనాన్ని ‘ఎక్స్‌’ ద్వారా డిప్యూటీ సీఎంకు ట్వీట్‌

● ‘సాక్షి’ కథనాన్ని ‘ఎక్స్‌’ ద్వారా డిప్యూటీ సీఎంకు ట్వీట్‌

మల్లాపూర్‌: మల్లాపూర్‌కు చెందిన వృద్ధురాలు ముష్కరి గంగామణి గ్రామసభలో నా 20 గుంటల వ్యవసాయ భూమిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 8విద్యుత్‌ స్తంభాలు వేసిండ్రు అంటూ తన ఆవేదనను వెల్లడిస్తూ ట్రాన్స్‌కో ఏఈ వినీత్‌రెడ్డిని వేడుకుంటున్న కథనం శుక్రవారం ‘సాక్షి’లో ‘‘కాల్మొక్త సారూ.. కనికరించండి’ శీర్షికన ప్రచురితమైంది. ఈ కథనాన్ని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఎక్స్‌ వేదికగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ట్విట్‌ చేశారు. విద్యుత్‌శాఖ మంత్రి భట్టి గారూ.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి అంటూ 20 గుంటల భూమిలో ఇష్టరీతిన స్తంభాలు వేస్తే సాగుకి నాగలి ఎట్టా తిరుగుతది? పంట ఎట్ల పండుతది? అంటూ డిప్యూటీ సీఎం బట్టితో పాటు మాజీ మంత్రి కేటీఆర్‌కు, సీఎంవో కార్యలయానికి పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement