అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు
బొమ్మకల్ బైపాస్ రోడ్డులో రాత్రి ఘటన
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థుల అత్యుహ్సం, అతివేగం రెండు నిండుప్రాణాలను బలితీ సుకుంది. బొమ్మకల్ బైపాస్‌రోడ్డులో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అతివేగంగా వెళ్తున్న కా రు అదుపుతప్పి ఎదురుగా ఆగిఉన్న లారీని ఢీకొ ట్ట డంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరో ఇ ద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. కరీంనగర్‌రూరల్ పోలీసుల కథనం మేరకు క రీంనగర్‌లోని అజ్మత్‌పురాకు చెందిన సయ్యద్ అ త్యాబ్(21) తన స్నేహితులైన అబ్దుల్ రహమాన్(19), అద్నాన్, అబ్రార్ హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో గురువారం రాత్రి 10.30గంటలకు టీ తాగేందుకు బొమ్మకల్ బైపాస్‌రోడ్డులో బయల్దేరారు. అత్యాబ్ వేగంగా కారు నడుపుతూ వీ కన్వెన్షన్ సమీపంలో ఎదురుగా రోడ్డుపై ఆగిన లారీ ని బలంగా ఢీకొట్టాడు. కారులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు, పోలీసులు కారులోంచి బయటకు తీశారు. అత్యాబ్‌ను చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి తరలించగా రాత్రి 11గంటలకు మృతిచెందాడు. మిగితా ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అబ్ధుల్ రహమాన్ అర్ధరాత్రి ఒంటిగంటకు మృతిచెందాడు. మిగితా ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతులు ఇద్దరు బీటెక్, గాయపడిన వారు ఇంటర్ చదువుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం కరీంనగర్ సీపీ గౌస్‌ఆలం, రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ నిరంజన్‌రెడ్డిలు పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సయ్యద్ అత్యాబ్(ఫైల్)
అబ్దుల్ రహమాన్(ఫైల్)


