ఫలించిన దుద్దిళ్ల బ్రదర్స్ వ్యూహం
మంథని: ప్రభుత్వ వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా సీఎం రేవంత్‌రెడ్డికి చేదోడు వాదో డుగా ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు.. మంథని మున్సిపల్ ఎన్నికల్లో సాదాసీదా ప్రచారంతో తన సత్తా చాటారు. రాష్ట్రంలోని కీలకమైన జిల్లాల్లో సీఎంతోపాటు ప్రచారం నిర్వహంచిన మంత్రి శ్రీధర్‌బాబుకు ఆయన సోదరుడు, టీపీసీసీ ప్రధాన కా ర్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అండగా నిలిచారు. దీంతో దుద్దిళ్ల బ్రదర్స్ వ్యూహం మంథనితోపాటు ఆ యా మున్సిపాలిటీల్లో సూపర్ హిట్ అయింది.
మంథనిలో 13కు 11 వార్డుల్లో కాంగ్రెస్ హవా
మంథనిలోని 13 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకపక్షంగా జయకేతనం ఎగురవేశారంటే దుద్దిళ్ల బ్రదర్స్ రచించిన వ్యూహం ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చావుదెబ్బ కొట్టినట్లయ్యింది. రేవంత్‌రెడ్డి నమ్మినబంటుగా ఉంటున్న శ్రీధర్‌బాబు వ్యూహాలు రా ష్ట్రంలనూ ఫలించినట్లు కాంగ్రెస్‌లో చర్చ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన శ్రీధర్‌బాబు.. ప్రస్తుతం పురపాలక సంఘ ఎన్నికల్లోనూ దిశానిర్దేశం చేసి భారీ విజయానికి పునాదులు వేసినట్లు చెబుతున్నారు.
కంటిమీద కునుకులేకుండా..
శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూనే క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే రాత్రి, పగలు తేడా లేకుండా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలింగ్ వరకు పనిచేశారు.
మంథనిపై ప్రత్యేక దృష్టి
మంథనిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా రా ష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోనూ శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు ప్రచారంలో పాల్గొన్నారు. ఒక్కోరోజు మూ డు నుంచి నాలుగు జిల్లాలు కవర్ చేసి క్యాడర్, ప్ర జల్లో ఎంతో ఉత్సాహం నింపారు. అక్కడక్కడా ఉన్న మైనస్‌లను కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సరిచేసి కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ఖరారు చేయడంతో తమదైన ముద్ర వేశారు.
ప్రభుత్వంపై విశ్వాసానికి ప్రతీక పురతీర్పు
సీఎం నాయకత్వంలోని ప్రజాప్రభుత్వంపై ప్రజలు చూపిన విశ్వాసం మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ప్రతీక అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. స్వార్థ రా జకీయాలకు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనే అజెండాగా పెట్టుకున్న కొన్నిశక్తులకు పురపో రు తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే.. మరోవైపు, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సా గుతోందన్నారు. గెలుపు స్ఫూర్తితో అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపులోతమదైన ముద్ర
సాదాసీదా ప్రచారంతో సత్తా


