కమలం వికసించేదెప్పుడో!
సాక్షి పెద్దపల్లి: దేశంలో కమలం వికసిస్తున్నా .. జిల్లాలో చతికిలబడుతోంది. నేతల మధ్య స మన్వయ లోపం, జిల్లా అధ్యక్షుడి నాయకత్వ లేమి, అనుభవరాహిత్యం తదితర కారణాల తో ప్రజల్లో ఆదరణ ఉన్నా.. దాన్నిఓట్ల రూపంలో పొందలేకపోతోందని ఆ పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటినా.. పంచాయతీ ఎన్నికల్లో 261 స్థా నాల్లో కేవలం 3 సర్పంచ్ స్థానాలు గెలిచింది. తాజాగా రామగుండం కార్పొరేషన్‌లో ఒకటి, పెద్దపల్లిలో ఒకటి, సుల్తానాబాద్‌లో ఒక వార్డులోనే విజయం సాధించింది. 124 స్థానాలకు కేవలం మూడు స్థానాల్లో గెలుపొందింది. మంథనిలో ఖాతా తెరవలేకపోయింది.
16 తర్వాతే విజయోత్సవాలు
సుల్తానాబాద్‌రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో గె లుపొదిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకునేందుకు ఈనెల 16 తేదీ తర్వా త అనుమతి ఉంటుందని డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సరళిని శుక్రవారం డీసీపీ పరిశీలించినంతరం మీడియాతో మాట్లాడారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ ఉన్నారు.
ముగిసిన ఎన్నికల ప్రక్రియ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో పూర్తయింది. 36వార్డుల్లో 43,789 మంది ఓటర్లు ఉండగా అందులో 32,201 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నా రు. బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను అభ్యర్థుల ముందే కుమ్మరించి లెక్కించి విజేతలను ప్రకటించారు. మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీ లో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. కమిషనర్ వెంకటేశ్‌కు సూచనలిచ్చారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ సారథ్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కౌన్సిలర్లుగా ఎన్నికై న వారి మద్దతుదారులు సంబురాల్లో మునిగితేలారు.
మంథనిలో కాంగ్రెస్ ర్యాలీ
మంథని: మున్సిపల్ ఎన్నికల్లో 13 వార్డులకు 11వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేత నం ఎగురవేయడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో పట్టణంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
జీజీహెచ్ తనిఖీ
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)ను కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తనిఖీ చేశారు. భవన నిర్మాణం ప్రగతిపై ఆరా తీశారు. పేషెంట్లు, సహాయకులు నిలబడి వేచి చూసే అవసరం రాకుండా అదనపు కుర్చీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు రాజు, అరుణ కృపాభాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ సందర్శన
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మకారాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
వేలాలకు ప్రత్యేక బస్సులు
గోదావరిఖనిటౌన్: మహాశివరాత్రి సందర్భంగా గోదావరిఖని నుంచి వేలాల జాతరకు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక బ స్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ నా గభూషణం తెలిపారు. పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.50 చార్జీ నిర్ణయించామని అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉచిత ప్రయాణం వర్తించదని ఆయన వివరించారు.
ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేల వార్డులో కాంగ్రెస్ గెలుపు
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్ము సుధాకర్ విజయం సాధించారు. ఈవార్డులో బీఆర్‌ఎస్ మాజీ ఎ మ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఓటేశారు.
రాముకు అత్యధిక మెజారిటీ
గోదావరిఖని: 38వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్‌గా నెలకంటి రాము విజయం సాధించారు. 2,524 ఓట్లకు రాము 1,720ఓట్లు సాధించారు. స మీప బీజేపీ అభ్యర్థి బూడిద శ్రీహర్షవర్ధన్‌పై 1,048ఓట్ల మెజార్టీ సాధించారు. డివిజన్‌లో 70శాతం ఓట్లను కై వసం చేసుకుని అత్యధిక ఓట్లు సాధించి రికార్డు నమోదు చేశారు.
కమలం వికసించేదెప్పుడో!
కమలం వికసించేదెప్పుడో!


