అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు
గోదావరిఖని: ప్రజామోదంతోనే రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ లభించిందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం ఏ ర్పాట చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. 60 డివిజన్లలో 38 డివిజన్లు కై వసం చేసుకుని ఘన విజయం సాధించామన్నారు. సింగరేణి, ఎ న్టీపీసీ కార్మికులకు రుణపడి ఉంటామన్నారు. ప్రతిపక్షాలు మానసికంగా ఎన్నిఇబ్బందులు పెట్టి నా ప్రజలు గొప్పతీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పిన వారికి ఫలితాలు చెంపపెట్టు లాంటివన్నారు. ఎన్నికల్లో ఎవ రెటువైపు వ్యవహరించినా.. ఆ తర్వాత మర్చిపోతామని, కక్షసాధింపు ఉండదని తెలిపారు. కార్పొరేటర్లుగా విజయం సాధించిన కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష, స్వతంత్రులకు అభినందనలు తెలిపా రు. ఓటమిపాలైన వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. నాయకులు మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి, గట్ల శ్రీనివాస్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్


