నమ్మి మోసపోతే.. గోసపడక తప్పదు
మంథని: గత ప్రభుత్వంలో మంథనిలో జరిగిన అ భివృద్ధిని చూసి మరింత ప్రగతి సాధనకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎన్నుకోవాలని మంథని మాజీ ఎ మ్మెల్యే పుట్ట మధు కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా గురువారం మున్సిపల్ పరిఽ దిలోని 2వ వార్డులో ఎరుకల గూడెం, ముత్యాలమ్మ వాడ, 3వ అంబేడ్కర్ నగర్‌లో ఆయన అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పట్టణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశామని, అలాగే మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా, ము న్సిపల్ చైర్‌పర్సన్‌గా పుట్ట శైలజ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


