● శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌ | - | Sakshi
Sakshi News home page

● శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌

Feb 6 2026 7:32 AM | Updated on Feb 6 2026 7:32 AM

● శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌

● శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌

● శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌

రామన్నకు అశ్రునివాళి

మంథని: అనారోగ్యంతో బాధపడుతూ రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో మృతి చెందిన మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి(రామన్న)కి పార్టీలకు అతీతంగా అశ్రునివాళి అర్పించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి మంథనికి రాంరెడ్డి భౌతికకాయం తీసుకువచ్చారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో పాటు పలువురు నివాళి అర్పించారు. గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి గడ్డం వివేక్‌, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నివాళి అర్పించారు. అనంతరం మంథని నుంచి పెద్ద ఎత్తున అంతిమ యాత్ర సాగగా ముత్తారం మండలం సీతంపేటలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. మంథనిలో కూరగాయల మార్కెట్‌, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement