సుల్తానాబాద్ చైర్మన్ పీఠం మాదే : బీజేపీ నేత సంజీవరెడ్
సుల్తానాబాద్ రూరల్: సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ దక్కించుకుంటుందని చేసుకుంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 15 స్థానాలకు 10 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు అకర్షితులవుతున్నారని అన్నారు. నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, సౌదరి మహేందర్‌యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, కందుల శ్రీనివాస్, మిట్టపల్లి ప్రవీణ్, హనుమంత్‌రెడ్డి, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్, కొమ్మిడి రాజేందర్‌రెడ్డి, వడ్లకొండ శశివర్ధన్, దాసరి చందు, వలస సాయి పాల్గొన్నారు.


