కాంగ్రెస్‌కు ఓటు వేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓటు వేయాలి

Feb 9 2026 8:13 AM | Updated on Feb 9 2026 8:13 AM

కాంగ్రెస్‌కు ఓటు వేయాలి

కాంగ్రెస్‌కు ఓటు వేయాలి

మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. స్థానిక ఓల్డ్‌అశోక టాకీస్‌ సెంటర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్నర్‌ మీ టింగ్‌లో వారు మాట్లాడారు. ప్రతీ హామీని అమలు చేస్తున్నామన్నారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇ చ్చారు. ప్రభుత్వ సలహాదారు హర్కరవేణుగోపా ల్‌, ఐఎన్‌టీయూసీ నేత జనక్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీపీ

మంథని: బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీపీ మదాడి శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ ఎక్కేటి అనంతరెడ్డి తదితరులు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరడం చాలాసంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement