గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
రామగుండం/గోదావరిఖనిటౌన్: రాబోయే ఏడాదిలో నిర్వహించే గోదావరినది పుష్కరాలను పురస్కరించుకొని గురువారం అంతర్గాం మండలం గోలివాడ, గోదావరిఖని వద్ద నది ప్రాంతాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. పుష్కర సమయంలో 30వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారనే అంచనాతో పుష్కర ఘాట్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు నిర్ణయించారు. ఆర్డీవో బి.గంగయ్య, సురేశ్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి, జాతర కమిటీ చైర్మన్ గీట్ల శంకర్‌రెడ్డి తదితరులున్నారు.
పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించాలి
పెద్దపల్లి: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలోని 90 అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుకు రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామని, వాటిని సద్వినియోగం చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు వచ్చి ఒకపూట భోజనం తీసుకునేలా చూడాలన్నారు. కేంద్రం నుంచి అందించే ఆహారపదార్థాల నాణ్యతను రెగ్యులర్‌గా చెక్ చేయాలని పేర్కొన్నారు. ప్రతీవారం అంగన్వాడీ టీచర్లు, సూపర్‌వైజర్ల పనితీరును పరిశీలిస్తానని తెలిపారు.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మా ట్లాడారు. గత పుష్కరాల్లో ఎదురైన అనుభవా లను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు, సురేశ్, సీడీపీవోలు అలేఖ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు.


