బస్సెక్కాలంటే పరుగెత్తాల్సిందే..
కాలేజీలో తరగతులు ముగిశాయి. విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు బస్సు కోసం బస్టాప్‌కు వచ్చారు. లగ్జరీ, రాజధానితోపాటు ఎలక్ట్రిక్, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎలాగూ అక్కడ ఆగవు. పల్లెవెలుగు ఒక్కటే వారికి దిక్కు. ఆపాలని చేతులు చూపినా పల్లెవెలుగు బస్సు డ్రైవర్ ఆపలేదు. అప్పటికే బస్సునిండా ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. రోడ్డుపై అంతకు రెట్టింపు మంది ఉన్నారు.. వీరందరూ బస్సులో నిల్చొనేందుకూ స్థలం లేదని డ్రైవర్ వాదన. ఇంతలోనే మరోబస్సు వచ్చింది.. అప్పటికే గంటల కొద్దీ నిరీక్షించి నీరసించిన విద్యార్థులు.. ఇదిగో చూడండి.. శక్తినంతా కూడబట్టుకుని ఇలా పరుగెత్తుతున్నారు. పెద్దపల్లి శివారులో శుక్రవారం చోటుచేసుకున్న దృశ్యాలు ఇవి..
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


