60 డివిజన్లు.. 277 పోలింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

60 డివిజన్లు.. 277 పోలింగ్‌ కేంద్రాలు

Feb 11 2026 7:17 AM | Updated on Feb 11 2026 7:17 AM

60 డివిజన్లు.. 277 పోలింగ్‌ కేంద్రాలు

60 డివిజన్లు.. 277 పోలింగ్‌ కేంద్రాలు

● 1,500 మంది సిబ్బంది సేవలు ● నేడు పోలింగ్‌.. ఏర్పాట్లు పూర్తి ● ఎన్నికల సామగ్రి పంపిణీ ● పర్యవేక్షించిన కలెక్టర్‌ శ్రీహర్ష

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో బుధవారం పోలింగ్‌ నిర్వహణకు అధికారులు ఏ ర్పాట్లు పూర్తిచేశారు. గోదావరిఖని శారదానగర్‌ శిశుమందిర్‌ స్కూల్‌లో కార్పొరేషన్‌ కమిషనర్‌ అరు ణశ్రీ నేతృత్వంలో మంగళవారం సిబ్బందికి ఎన్నిక ల సామగ్రి పంపిణీ చేశారు. నగరంలో 277 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పటు చేయగా.. 1,500 మంది సిబ్బందిని నియమించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పర్యవేక్షించి అధికారులకు సూచనలిచ్చారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేశ్‌ బందోబస్తు చేపట్టారు.

సిబ్బందికి సామగ్రి పంపిణీ

బల్దియాలోని 272 పోలింగ్‌ కేంద్రాల్లో సేవలు అందించే ఎన్నికల సిబ్బందికి మంగళవారం బ్యాలెట్‌ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. వారు 30 రూట్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు.

13న ఓట్ల లెక్కింపు

శారదానగర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందుకోసం తరగతి గదుల్లో బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. అక్కడే స్ట్రాంగ్‌రూమ్‌ కూడా ఏర్పాటు చేశారు. 72 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లుగా, 144 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లుగా నియమించారు. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. డిగ్రీ కాలేజీలో ప్రత్యేక పోలీసు భద్రత చర్యలు చేపడుతున్నారు.

అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: అర్హులైన వారందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్‌, మున్సిపల్‌ కమిషనర్లు వెంకటేశ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రిటికల్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా

మంథని: ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ కో య శ్రీహర్ష కోరారు. మంథని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతీపోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌, క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల బయట కూడా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీవో సురేశ్‌, ము న్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ తదితరులు ఉన్నారు.

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సిబ్బంది

పెద్దపల్లి: జిల్లా కేందంల్రోపి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఎన్నికల సామగ్రి తీసుకున్న సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు సాయంత్రమే చేరుకున్నారు. పోలింగ్‌ పకడ్బందీగా నిర్వహిస్తామ ని పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి రెండు బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేశామని, అత్యవసరమైతే వాటిని ఉపయోగిస్తామని సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ వివరించారు. అధికారులు పాల్గొన్నారు.

ఇంటికి కిలో చికెన్‌..

కొందరు అభ్యర్థులు తమ మద్దతుదారులతో ఇంటింటికీ కిలో చికెన్‌తోపాటు రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను కాపాడుకుంటేనే గెలుపు తమదేననే ధీమాతో దాదాపు అన్నిపార్టీల అభ్యర్థులు చివరి అస్త్రంగా ఆర్థిక బలాన్ని నమ్ముకున్నారు. నగదు పంపిణీ చేయలేని మరికొందరు అభ్యర్థులు ఓటర్ల కాళ్లు మొక్కడమే శరణ్యంగా భావిస్తున్నారు.

మంథనిపై ప్రత్యేక దృష్టి

మంథని: మంథనిలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందజేయగా.. పోలింగ్‌కేంద్రాలకు చేరుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, మాజీఎమెల్యే పుట్ట మధు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో పోరు ప్రతిష్టాత్మకమైంది. అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 14 అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ఎస్సైలను ఇన్‌చార్జిలుగా నియమించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement