మదర్ థెరిసాలో డిప్లొమా విద్యార్థులకు వర్క్‌షాప్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మదర్ థెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో టాస్క్ ఆధ్వర్యంలో డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్‌క్యూఎల్ అనే అంశంపై మూడురోజుల వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్ క్యూ ఎల్‌కి సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు కల్పించినట్లు రిసోర్స్ పర్సన్ రత్నప్రియ తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్‌కుమార్, అకడమిక్ ఇన్‌చార్జి ఇజాజ్‌ఖాన్, హెచ్‌వోడీ శశికాంత్, నవ్య, షాకీర్, శిరీష పాల్గొన్నారు.


