ప్రతిభావంతులకు ప్రశంస
పెద్దపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఈనెల 8న జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పో టీల్లో గోల్డ్‌మెడల్ సాధించిన సహస్ర, సిల్వర్ మెడల్ సాధించిన అహ్మద్, హర్షవర్ధన్, సాహి తి, శివవర్ధిని తదితరులను కలెక్టర్ కోయ శ్రీహ ర్ష అభినందించారు. మంగళవారం కలెక్టరేట్ లో వారికి అభినందించిన కలెక్టర్.. భవిష్యత్ లో మంచిప్రతిభ చూపి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కరాటే మాస్టర్ సంకెండ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు వేతనంతో కూడిన సెలవు
పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పె ద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతోపాటు రామగుండం కార్పొరేషన్‌లోని అ న్నిరంగాల కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులు, సిబ్బందికి ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష సూ చించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ఇతర రంగాల యజమానులు ఈ ని బంధనలు అమలు చేయాలని సూచించారు.
దరఖాస్తులు ఆహ్వానం
సినిమా, నిర్మాణ రంగాల్లో స్వల్పకాలిక నైపు ణ్య కోర్సులు అందిస్తున్నామని, ఆసక్తి గలవా రు దరఖాస్తు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపా రు. వివరాలకు 99633 13318, 90002 94176 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.
స్వేచ్ఛగా ఓటు వేయండి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో బుధవారం జరిగే ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛ గా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ కోరారు. శా రదానగర్ శిశుమందిర్ స్కూల్‌లో ఏర్పాటు చే సిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌లో మంగళవారం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చే శారు. కమిషనర్ మాట్లాడుతూ, ఒకటో డివిజ న్ మినహా మిగిలిన 59 డివిజన్లలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వ రకు పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రతీపోలింగ్ కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించామని కమిషనర్ అన్నారు. నడవలేని వారికోసం చక్రాల కుర్చీలు, సా యం చేసేందుకు వలంటీర్లను అందుబాటులో ఉంచామని అన్నారు. హెల్ప్‌డెస్క్, మెడికల్ క్యాంప్ కూడా ఉంటాయని ఆమె వివరించారు.
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సుల్తానాబాద్‌రూరల్: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీసీపీ రాంరెడ్డి అన్నారు. పోలీస్ సిబ్బందికి మంగళవారం ఆయన బందోబస్తుపై దిశానిర్దేశం చేశా రు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఏసీపీ కృష్ణ, సీఐలు సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్సైలు అశోక్‌రెడ్డి, వెంకటేశ్, రమేశ్, సనత్‌రెడ్డి, మధుకర్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
విద్యారంగానికి నిధులివ్వాలి
పెద్దపల్లి: విద్యా రంగానికి బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ కోరారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని, స్కా లర్‌షిప్‌లు, ఫీజురీయంబర్స్‌మెంట్ సకాలంలో విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని, విద్యారంగానికి బడ్జెట్లో 7.8 శాతమే నిధులు కేటాయించి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లెల ప్రశాంత్, ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభావంతులకు ప్రశంస
ప్రతిభావంతులకు ప్రశంస
ప్రతిభావంతులకు ప్రశంస


