శివాలయంలో రుద్రాభిషేకం | - | Sakshi
Sakshi News home page

శివాలయంలో రుద్రాభిషేకం

Feb 10 2026 7:18 AM | Updated on Feb 10 2026 7:18 AM

శివాల

శివాలయంలో రుద్రాభిషేకం

శివాలయంలో రుద్రాభిషేకం కోతుల దాడిలో చిన్నారికి గాయాలు కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి ఎంపీకి వినతి ఆఖరు రోజున ప్రచారహోరు

జూలపల్లి: మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ అర్చకులు ఉద్దండ నవీన్‌ రుద్రాభిషేం నిర్వహించారు. హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ పొట్టాల మల్లేశం, కోశాధికారి రమేశ్‌, ధర్మకర్తలు దేవసాని శంకరయ్య, వజ్రారెడ్డి, వెంకటరమణ ఉన్నారు.

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం కార్పొరేషన్‌ 21వ డివిజన్‌ ఎల్కలపల్లిగేట్‌లో మూడేళ్ల చిన్నారిపై కోతులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి రేబీస్‌ ఇంజక్షన్‌ వేశారు. కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని కాలనీవాసులు అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

జ్యోతినగర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఐఎన్‌టీయూసీ జాతీయ సీనియర్‌ కార్యదర్శి బాబర్‌ సలీంపాషా అన్నారు. ఎన్టీపీసీ రామగుండం ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్‌ ట్యాక్సీ, ఆటో స్టాండ్‌ యూనియన్‌ సభ్యులతో సోమవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 60మందిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్‌, ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌ నాయకుడు ఆరెపల్లి రాజేశ్వర్‌, ట్యాక్సీ, ఆటో యూనియన్‌ సభ్యులు సభ్యులు పాల్గొన్నారు.

ఓదెల: కాజీపేట్‌ టూ బల్హార్షా సెక్షన్ల మధ్యలోని ఓదెల రైల్వేస్టేషన్‌లో తిరుపతి, అండమాన్‌ రైళ్లు, కొలనూర్‌, పొత్కపల్లి రైల్వేస్టేషన్లో అజ్నీ రైళ్ల హాల్టింగు కోసం న్యూఢిల్లీలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నివాసంలో కాంగ్రెస్‌ మండల నాయకుడు అల్లం సతీశ్‌ సోమవారం వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ పార్లమెంట్‌ సమావేశాల్లో రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైళ్ల హాల్టింగ్‌ కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు సతీశ్‌ తెలిపారు.

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆఖరు రోజున ప్రచారం హోరెత్తించారు. పోటీపడుతున్న అభ్యర్థులు వాడవాడలా కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించి ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించారు. ఒకే వార్డులో ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుదారులతో ర్యాలీలు నిర్వహించేందుకు పోటీపడ్డారు. ఆ వార్డు ఓటర్లతోనే ప్రదర్శనలు నిర్వహించడంతో ఓ పార్టీ ప్రచారం పూర్తయ్యాక.. వారే మళ్లీ వేరొక పార్టీకి మద్దతుగా ప్రదర్శనలో పాల్గొనడం గమనార్హం.

శివాలయంలో రుద్రాభిషేకం
1
1/3

శివాలయంలో రుద్రాభిషేకం

శివాలయంలో రుద్రాభిషేకం
2
2/3

శివాలయంలో రుద్రాభిషేకం

శివాలయంలో రుద్రాభిషేకం
3
3/3

శివాలయంలో రుద్రాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement