ప్రజలు రాసిన తీర్పు ఇది
చిన్న ప్రచారం.. పెద్ద విజయం
తొలిమున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఓటర్లదే గెలుపు
వాల్‌రైటింగ్, ఆటోల్లో మైకుల్లో మాట్లాడుతూ ముందుకు..
డబ్బు, మందు పంపిణీ లేకుండా ఇంటింటికీ ప్రచారం
అనుభవాలు గుర్తుచేసిన రామగుండం మాజీ కౌన్సిలర్లు
రూ.3వేల ఖర్చుతో గెలిచా
కోల్‌సిటీ(రామగుండం): అధికార యంత్రాంగం, రాజకీయ శక్తుల అంచనాలు తలకిందులు చేస్తూ ప్రజల మనసును గెలుచుకున్న తొలిమున్సిపల్ ఎన్నికలు రామగుండం రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. పెద్దగా ఖర్చులేదు. హడావుడి ప్రచారం లేదు. ఇంటింటా ఒకటేమాట.. వ్యక్తిగత పరిచయం.. సమస్యలపై స్పష్టమైన హామీలే ఆయుధంగా చేసుకున్న అభ్యర్థులు.. ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. దీనివెనుక ఉన్న వ్యూహం, ప్రజల స్పందన, అభివృద్ధిపై మాజీ కౌన్సిలర్ల అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
దగ్గరితనం గెలిపించింది
శ్రీతొలిమున్సిపల్ ఎన్నికల సమయంలో మేం ఎదుర్కొన్న ప్రధాన సవాల్ వనరుల కొరత. భారీఫ్లెక్సీలు, వాహనయాత్రలు లేవు. మేమే ఒక్కోవార్డు తిరిగి ఓటర్లతో మాట్లాడాంశ్రీ అని మాజీ కౌన్సిలర్ ఒకరు గుర్తు చేసుకున్నారు. సగటున ఒక్కో అభ్యర్థి చేసిన మొత్తం ఖర్చు ప్రస్తుతంతో పోల్చితే చాలా తక్కువన్నారు.
అభివృద్ధికి తొలిఅడుగులు
ఎన్నికల తర్వాత కౌన్సిల్ తొలిప్రాధాన్యంగా వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సరఫరాలో నాణ్యత, మెయిన్‌రోడ్ల అభివృద్ధి, విద్యుత్ సదుపాయాలు మెరుగుపర్చింది.
రాజకీయానికి పునాది
తొలిమున్సిపల్ ఎన్నికలు రామగుండంలో ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేశాయి. డబ్బుకన్నా ప్రజల నమ్మకమే గెలుపునిచ్చే శక్తి అనే సందేశం ఇచ్చాయి. ఆ అనుభవాలు కొత్తతరం నేతలకు మార్గదర్శకమవుతున్నాయి.
1998లో జరిగిన తొలిమున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీచేసి గెలిచా. కేవలం రూ. మూడు వేలే ఖర్చయ్యాయి. నోటిఫైడ్ ఏరియా నుంచి చురుకుగా, సేవాభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నా. ఇవే నన్ను రాజకీయాల వైపు నడిపించాయి. 1995లో కాంగ్రెస్ పార్టీలో చేరా. కౌన్సిలర్‌గా పోటీచేయాలని శ్రీపాదరావు టికెట్ ఇచ్చారు. నేను నిర్మించిన రోడ్లు ఇప్పటికీ మన్నికగా ఉన్నాయి.
– మారెల్లి రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్
ప్రజలు రాసిన తీర్పు ఇది


