● రెండు పార్టీల పరస్పర సహకారం ● క్రాస్‌ఓటింగ్ జరిగే అవ
అయితే బీజేపీ.. లేదంటే బీఆర్‌ఎస్
గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్, బీ జేపీ క్రాస్‌ఓటింగ్‌కు సిద్ధమయ్యాయి. బీజేపీ వీక్‌గా ఉన్న ప్రాంతంలో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని, బీఆర్‌ఎస్ వీక్‌గా ఉన్నడివిజన్‌లో బీజేపీ అభ్యర్థుల కు ఓటు వేయాలని రెండు పార్టీలు పరస్పరం సహకారం అందించుకుంటున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు టార్గెట్ గా ఈ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నట్లు తె లుస్తోంది. ఈ ప్రభావం పలు డివిజన్లలోని అధికార కాంగ్రెస్ అభ్యర్థులపై పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీలు ఒక్కటైన విషయాన్ని అ ధికార కాంగ్రెస్ పార్టీ సైతం అంగీకరిస్తోంది. గతంలోకన్నా ఈసారి బీజేపీ నగర ప్రాంత ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అన్నిప్రయత్నాలూ చేస్తోంది. అయితే కొంచెం వెనకంజలో ఉన్న బీఆర్‌ఎస్ కూడా బలాబలాలను బేరీజు వేసుకుంటోంది. ఈక్రమంలో రెండు పార్టీల అభ్యర్థులు చాలాచోట్ల ఒక్కటై అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దెబ్బతీయాలని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదేనిజమైతే రామగుండం ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్, బీజేపీ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల నిర్ణయం ఏమైనా వారి భవితవ్యం నిర్ణయించేది మాత్రం ఓటర్లే..


