ఓట్ల పండుగ నేడే | - | Sakshi
Sakshi News home page

ఓట్ల పండుగ నేడే

Feb 11 2026 7:17 AM | Updated on Feb 11 2026 7:17 AM

ఓట్ల

ఓట్ల పండుగ నేడే

ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు, బందోబస్తు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 580 మంది అభ్యర్థులు ఓటుహక్కు వినియోగించుకోనున్న 2,58,064మంది ఓటర్లు

సాక్షి పెద్దపల్లి: ఓట్ల పండుగకు వేళఅయ్యింది. జిల్లాలోని రామగుండం రామగుండం కార్పొరేషన్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లోగల 123 డివిజన్లు/వార్డులకు బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 407 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రమే ఎన్నికల సామగ్రితో సిబ్బంది త మకు కేటాయించిన సెంటర్లకు చేరుకున్నారు. రా మగుండం కార్పొరేషన్‌లోని ఒకటో వార్డు మినహా మిగిలిన 123 వార్డుల్లో వివిధ పార్టీలకు చెందిన 580మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2,58,064 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. మహిళా ఓటర్లు 1,29,749 మంది, 1,28,281 మంది పురుష ఓటర్లు, ఇతరులు 34మంది ఉన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపుకార్డే(ఎపిక్‌ కార్డు) కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీల్లో ఏదైనా ఒకటి సిబ్బందికి చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సిబ్బంది, సామగ్రి

రామగుండంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దపల్లిలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, సుల్తానాబాద్‌లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, మంథనిలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో మంగళవారం సాయంత్రమే చేరుకున్నారు. పోలింగ్‌ తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌లను ఇవే కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరచనున్నారు. ఈనెల 13న ఆయా కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

వలస ఓటర్లపై ఫోకస్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీఓటు కీలకమే. ఒక్కఓటుతో సైతం ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిలో ప్రతీవార్డు, డివిజన్‌లో సుమారు 150 నుంచి 500 మంది వరకు వలస ఓటర్లు ఉన్నారు. ఈ ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపనున్నాయి. దీంతో అభ్యర్థుల తరఫున కొందరు వలసఓటర్లకు వాహనాలను సమకూర్చుతున్నారు. ఒకరి ద్దరు ఉంటే బస్సు చార్జీల కు డబ్బులు పంపించి ఇక్కడకు పిలిపించుకుంటున్నారు. మొత్తంగా అభ్యర్థులు వలస ఓట్లపైనే ఆధారపడుతున్నారు.

మద్యం, మాంసం జోరుగా పంపిణీ

ఓటర్లను తమవైపు తిప్పుకు నేందుకు అ భ్యర్థులు పోటాపోటీగా మద్యం, చికెన్‌, మటన్‌ పంపిణీ చేశారు. సోమ, మంగళవారం రాత్రివేళల్లోనే నగదు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఒక్కోవార్డులో ఒక్కోవిధంగా అభ్యర్థుల స్థాయిని బట్టి ప్రలోభాలు ఓటర్లకు అందజేశారు. ఒక అభ్యర్థి ఓటుకు రూ.1000 ఇస్తే.. మరో అభ్యర్థి రూ.2,000 చొప్పున ఇచ్చినట్లు సమాచారం. ఒకరు ఒక్కో ఓటుకు క్వార్టర్‌ మద్యం పంచితే, మరొకరు హాఫ్‌ బాటిల్‌ మద్యం అందించినట్లు తెలిసింది. కొన్నిచోట్ల ఓటుకు రూ.5,000 చొప్పున పంచినట్లు కూడా సమాచారం అందింది. ఇటు ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదననే విమర్శలూ వస్తున్నాయి.

బల్దియాల సమాచారం

బల్దియా వార్డులు ఓటర్లు అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రాలు పీవోలు ఏపీవోలు

రామగుండం 59 1,83,049 314 277 332 1,662

పెద్దపల్లి 36 43,789 157 73 89 444

సుల్తానాబాద్‌ 15 16,824 61 30 36 180

మంథని 13 14,402 48 26 31 155

మొత్తం 123 2,58,064 580 406 488 2,441

ఓట్ల పండుగ నేడే1
1/3

ఓట్ల పండుగ నేడే

ఓట్ల పండుగ నేడే2
2/3

ఓట్ల పండుగ నేడే

ఓట్ల పండుగ నేడే3
3/3

ఓట్ల పండుగ నేడే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement