కార్పొరేషన్లు, మున్సిపాలిటీలూ గెలుచుకుంటాం
కమాన్‌పూర్(మంథని): రాష్ట్రంలోని మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గెలుచుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం హైదరాబాద్ వెళ్తున్న మంత్రిని కమాన్‌పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకులు కలిసి కాసేపు ముచ్చటించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు తమకు పూర్తి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మోజార్టీతో గెలిపించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కమాన్‌పూర్ ఎక్స్‌రోడ్డు – రాజాపూర్ ఎస్సారెస్పీ కాలువపై శిథిలావస్థలో ఉన్న కల్వర్టును పరిశీలించారు. కల్వర్టు మరమ్మతుకు ప్రతిపాదనలు పంపించాలని ఇరిగేషన్ ఈఈ బలరామయ్యకు సూచించారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులపై చర్యలు తీసుకోవాలని గుండారం గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు మంత్రిని వేడుకున్నారు. సర్పంచులు రంగు సత్యనారాయణ, బొంగొని సదయ్య, ఉపసర్పంచ్ అంబీరు రాజేందర్, కోలేటి మారుతి, ఇనగంటి భాస్కర్‌రావు, పిడుగు శంకర్, అడ్వాల చంద్రయ్య, వార్డు సభ్యులు పిడు గు సదయ్య, కవిత, కృష్ణ, రవి పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు


