కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
గోదావరిఖని(రామగుండం): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఉదయం నుంచి కొనసాగనున్న కౌంటింగ్‌కు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్‌లో రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. గోదావరి ఖని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధి, వెలుపలి రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, అనధికార వాహనాలు, వ్యక్తులు లోనికి అనుమతించబోమని పోలీసుశాఖ స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును భద్రతా సిబ్బందికి చూపించిన వారికే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశం ఉంటుందని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, లైటర్లు వంటి నిషేధిత వస్తువులను కౌంటింగ్ హాల్లులోకి అనుమతి లేదన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, బాణాసంచా, డీజేలను పూర్తిగా నిషేధించారు.
కమిషనరేట్‌లో బందోబస్తు ఇలా..
డీసీపీలు 02
అడిషనల్ డీసీపీ 01
ఏసీపీలు 07
సీఐలు 33
ఎస్సైలు 96
ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు 149
కానిస్టేబుళ్లు 518
హోంగార్డులు 113
స్పెషల్ పార్టీ, ఆర్మ్‌డ్ సిబ్బంది 158
సహకరించాలి
రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో సుమారు 1,075 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం. పోలీసుశాఖకు ప్రజలు, నాయకులు సహకరించాలి.
– అంబర్‌కిషోర్‌ఝా, రామగుండం సీపీ


