రిజల్ట్ డే
పట్టణం కౌంటింగ్ కేంద్రం టేబుల్స్ పోస్టల్ ఓట్లు పోలైన ఓట్లు
రామగుండం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 59 467 1,24,520
పెద్దపల్లి మదర్‌ఽథెరిస్సా కాలేజీ 36 215 32,201
సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ 15 72 13,716
మంథని ప్రభుత్వ బాలుర పాఠశాల 13 49 11,056
మొత్తం 123 803 1,81,493
జిల్లాలో పోలైన ఓట్లు..
సాక్షి పెద్దపల్లి:
నిరీక్షణ.. నరాలు తెగే ఉత్కంఠకు.. మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో.. పరాజితులెవరో తేలబోతోంది. పట్టణ ప్రజలు ఎవరిని ఆశీర్వదించారో.. ఎవరిని తిరస్కరించారో.. ఎవరికి పట్టం కట్టారో.. ఎవరిని దూరం పెట్టారో నేడు తేలనుంది. మరికొద్ది సేపట్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నానానికి అభ్యర్థుల విజయావకాశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్ సహా మూడు మున్సిపాలిటీల్లో కలిపి 123 వార్డుల్లో 580 మంది బరిలో నిలిచారు. వారందరూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా, ఫలితాల కోసం పుర ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ముందుగా పోస్టల్ ఓటు
ముందుగా ఆయా మున్సిపాలిటీల్లోని 803 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అనంతరం, వార్డుకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన టేబుల్స్‌పై ఆయా వార్డులకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను ఓపెన్ చేసి, 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టనున్నారు. అనంతరం అభ్యర్థుల వారీగా లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాల సరళిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నువ్వా.. నేనా..
బల్దియాల్లోని పలు వార్డుల్లో నువ్వా, నేనా అన్నట్లుగా ప్రచారం, పోల్ మేనేజ్‌మ్మెంట్ చేశారు. పోటాపోటీగా డబ్బులు, చీరలు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో గెలుపు తమదేనని అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. పోలైన ఓట్ల వివరాలతో అభ్యర్థులు గురువారం లెక్కలు వేసుకున్నారు. ఏ కాలనీలో ఓట్లు పడ్డాయి.. ప్రత్యర్థికి ఏ వర్గం వారు సపోర్టు చేశారు.. అంటూ ఆరా తీస్తూ గెలుపుపై లెక్కలు వేసుకున్నారు.
క్యాంపు రాజకీయాలు స్టార్ట్
జిల్లాలోని 124 వార్డుల్లో రామగుండం కార్పొరేషన్ మొదటి డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవగా మిగిలిన 123 వార్డులకు 580 మంది బరిలో నిలిచారు. శుక్రవారం కౌంటింగ్ చేపట్టనుండగా, ఈ నెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ను ఎన్నుకోనున్నారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతుండగా, తమ పార్టీ తరఫు న గెలిచిన కార్పొరేటర్స్ చేజారకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా రామగుండం కార్పొరేషన్ పరి ధిలోని బీఆర్‌ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే క్యా ంపునకు తరలించారు. దీంతో నేడు వెలుబడనున్న ఫలితాలు అందరిలో ఉత్కంఠను రేపుతున్నాయి.
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
ఏర్పాట్లు చేసిన అధికారులు
మొదలైన క్యాంపు రాజకీయాలు, 16న చైర్మన్ ఎన్నిక


