పకడ్బందీగా ఓట్ల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

Feb 13 2026 5:26 AM | Updated on Feb 13 2026 5:26 AM

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

కమిషనర్‌ అరుణశ్రీ

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింవు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.అరుణశ్రీ తెలిపారు. గురువారం నగరపాలక కార్యాలయంలో ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 8గంటలకే పోస్టల్‌ బ్యాలెట్‌, అనంతరం, 59 డివిజన్లకు సంబంధించి ఏక కాలంలో బ్యాలెట్‌ బాక్సుల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. వెయ్యి ఓట్లకు ఒక రౌండ్‌ చొప్పున దాదాపు మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందన్నారు. కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, అసిస్టెంట్లుగా 180 మందిని నియమించినట్లు తెలిపారు. శిక్షకులు కె.శ్రీనివాస్‌, జె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పెద్దపల్లిలో

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం కలెక్టరేట్‌ సమీపంలోని మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కాలేజీలో జరగనుంది. ఉదయం 8గంటలకు లెక్కింపు మొదలవుతుందని కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు. ఆరు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, 120 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు.టీపీవో నరేశ్‌, వినయ్‌, కిరణ్‌, ఏఈ సతీశ్‌, కృష్ణారెడ్డి తదితరులున్నారు.

మంథనిలో..

మంథని: మంథనిలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 13 వార్డులకు గాను 13 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, సూపర్‌వైజర్లు మొత్తం 39 మంది విధుల్లో ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement