మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి బల్దియాలోని 36 వార్డుల నుంచి అభ్యర్థులుగా పోటీచేసిన వారితో గురువారం సమీక్ష నిర్వహించారు. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు వివరించారు. మెజార్టీ వార్డులను కాంగ్రెస్ గెలుచుకుని చైర్మన్ పీఠం దక్కించుకుంటుందని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని, పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


