అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దు | - | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దు

Feb 10 2026 7:18 AM | Updated on Feb 10 2026 7:18 AM

అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దు

అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దు

సుల్తానాబాద్‌ రూరల్‌: పార్టీ నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి రమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సుల్తానాబాద్‌ మున్సిపల్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కొన్ని పనులు మిగిలిపోయాయని, వాటిని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేస్తూ తాఆమే సుల్తానాబాద్‌ పట్టణం అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ పాల రామారావు, తాళ్లపల్లి మనోజ్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ కోడెం అజయ్‌, పారుపల్లి గుణపతి, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ సందీప్‌రావు, అనుమాల బాపూరావు, మల్లికార్జున్‌, అరుణ్‌, పురం రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement