బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం | - | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

Feb 12 2026 11:29 AM | Updated on Feb 12 2026 11:29 AM

బ్యాల

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

● పెద్దపల్లిలో సింహం గుర్తు అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఒక్కటయ్యారు. ఉమ్మడి బీజేపీ అభ్యర్థికి అందరూ మద్దతు తెలపడంతో ఆ వార్డు ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. సదరు వార్డులో ఓటుకు రూ.6వేలు ధర పలికింది. ● ఒకవార్డులో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఓటుకు రూ. 2వేలు పంచగా, అధికార పార్టీ అభ్యర్థి రూ.3 వేలు పంచారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి.. మరో సారి ఇంటింటికీ తిరిగి అదనంగా రూ.వెయ్యి పంచిపెట్టారు. అక్కడి ఓటరు ఎవరికి మొగ్గు చూపారో అభ్యర్థులకు అంతుచిక్కడం లేదు. ● ఒకవార్డులో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య టఫ్‌ ఫైట్‌ నెలకొంది. గతంలో కౌన్సిలర్‌ గా పనిచేసిన అనుభవం ఉన్న అభ్యర్థి ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేపట్టారు. అధికార పార్టీ అభ్యర్థి ఓటుకు ఏకంగా రూ.5 నుంచి రూ.7వేలు, చీర పంపిణీ చేశారు. దీంతో గెలుపుపై ఆశలు సన్నగిల్లిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి.. డబ్బుల పంపిణీని మధ్యలో ఆపివేశారు. ● ఓ వార్డులో సింహం గుర్తుపై పోటీచేసిన అభ్యర్థి ఓటుకు రూ.2వేలు పంచగా, అధికార పార్టీ అభ్యర్థి రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేసి, ఓటర్ల కాళ్లు మొక్కడంతో అక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ● ఓ డివిజన్‌లో ఓ అభ్యర్థి ఓటుకు రూ. 500 పంచగా, ప్రత్యర్థి ఏకంగా రూ.వెయ్యి చొప్పున పంచారు. దీంతో అప్పటికప్పుడు అప్పు తీసు కొచ్చి రూ.1,500చొప్పున మరోసారి పంచారు. ● ఓ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి క్వార్టర్‌ మద్యంతోపాటు ఓటుకు రూ.4వేలు పంచగా, బీజేపీ అభ్యర్థి ఓటుకు రూ.3వేలు, ఫుల్‌బాటిల్‌ మద్యం, టవల్‌ పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఉదయం మరో సారి రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ● ఓ వార్డులో ఓ చిరువ్యాపారి ఓటుకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు? మీకోసం ఎంతసేపు చూడాలని ఏకంగా అభ్యర్థికే ఫోన్‌చేసి విసి గించారు. తీరా డబ్బులు ఇవ్వడానికి పోతే.. ఓటుకు రూ.2,500 కాదు, రూ.5వేల చొప్పున తమ ఇంట్లోని ఏడు ఓట్లకు రూ.35వేలు ఇవ్వాలని, తమ కొడుకు హైదరాబాద్‌ నుంచి వస్తున్నాడని, కారుకు అదనంగా రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. చిర్రెత్తిన అభ్యర్థి.. నీ ఓటు వద్దు.. నీకో దండం.. అని డబ్బులు వాపస్‌ తీసుకుని వెళ్లారు. సదరు వ్యాపారి.. అభ్యర్థిని బతిమిలాడి తిరిగి డబ్బులు తీసుకు న్నాడు. ఇలా అనేకమంది ఓటర్లు అభ్యర్థులకు నేరుగా ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయడం గమనార్హం.

సాక్షి పెద్దపల్లి: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తా రు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువను అర్థం చేసుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో బల్దియాల్లో 75.28శాతం పోలింగ్‌ నమోదైంది. బుధవారం ఉదయం 7గంటల నుంచే ఓటు వేసేందుకు ఉత్సాహంతో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిశాక అధికారులు బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు.

పర్యవేక్షణ.. భారీ బందోబస్తు

రామగుండం కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీ ల్లో పోలింగ్‌ తీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించారు. రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి 29వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి తమ ఫొటోలు, గుర్తుల తో కూడిన ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారని బీజేపీ నేతలు నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు మనో హర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి చేరుకుని సదరు అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రామగుండం 17వ డివిజన్‌ అధికారుల వద్ద ఉండాల్సిన ఓట రు జాబితా కాంగ్రెస్‌ నేతలు బయటకు తీసుకొచ్చా రని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా చేశారు. ఇవి మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

ఓటుకోసం సొంతూరికి

పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు ఓటుహక్కు వినియోగించుకోవడానికి స్వస్థలాలకు తరలివచ్చారు. గెలుపోటములకు ప్ర తీ ఓటుకీలకం కావడడంతో అభ్యర్థులు వారికి రవాణా చార్జీలు చెల్లించి మరీ రప్పించారు. దీంతో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతం పెరిగింది.

కఎలెక్షన్‌ పదనిసలు

ఓటేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, పుట్ట మధు, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌, రామగుండం మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్‌ నేత ఎస్‌.కుమార్‌

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పురపోరు

బల్దియాల్లో 75.28 శాతం పోలింగ్‌ నమోదు

ఓటుహక్కు వినియోగించుకున్న 1,81,493 మంది ఓటర్లు

సుల్తానాబాద్‌లో అత్యధికం.. రామగుండంలో అత్యల్పం

పోలైన ఓట్లు

బల్దియా మొత్తం పోలైనవి

మంథని 14,402 11,056

పెద్దపల్లి 43,789 32,201

రామగుండం 1,79,624 1,24,520

సుల్తానాబాద్‌ 16,824 13,716

గంటల వారీగా పోలింగ్‌ శాతం ఇలా..

బల్దియా 9.00 11.00 1.00 3.00 ఫైనల్‌

మంథని 15.60 37.38 57.49 69.48 76.76

పెద్దపల్లి 11.06 30.52 50.69 64.41 73.54

రామగుండం 09.50 24.31 42.12 56.49 69.32

సుల్తానాబాద్‌ 15.75 38.80 60.70 74.48 81.53

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 1
1/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 2
2/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 3
3/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 4
4/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 5
5/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 6
6/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 7
7/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 8
8/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 9
9/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 10
10/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 11
11/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 12
12/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 13
13/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 14
14/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 15
15/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 16
16/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 17
17/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 18
18/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం 19
19/19

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement