శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవంలో భక్తులు, స్వామివారి సన్నిధిలో పూజలు చేస్తున్న ప్రభుత్వ విప్ విజయరమణారావు, నాయకులు
జూలపల్లి: పెద్దాపూర్ శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నా యి. ఇందులో భాగంగా శుక్రవారం రథోత్సవం, జాతర ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆల యంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం స్వా మివారి ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొచ్చి రథంపై ఆశీనులను చేశారు. అనంతరం పువీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరుకాగా ఆలయ ఈవో సదయ్య, అర్చకులు, ధర్మకర్తలు, సర్పంచ్ తొగరు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రజని– రవీందర్‌రెడ్డి, సభ్యులు ఘనస్వాగతం పలికారు. ధర్మకర్తలు రాజభాస్కర్‌రెడ్డి, నరేశ్‌రెడ్డి, బీజేపీ నాయకుడు సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఆర్డీవో గంగయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్ల మనోహర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తదితరులు వేడుకలకు హాజరయ్యారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు సనత్‌కుమార్, మధుకర్, సిబ్బంది పటిష్ట బందో బస్తు చేపట్టారు.
ప్రత్యేకపూజలు చేసిన ప్రముఖులు


