దొడ్డి కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

దొడ్డి కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం

Apr 4 2026 9:49 AM | Updated on Apr 4 2026 9:49 AM

పెద్దపల్లి: తెలంగాణ తొలిఅమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. తొలుత దొడ్డి కొమురయ్య చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రంగారెడ్డి మా ట్లాడుతూ, నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ కో సం సాయుధపోరు సాగించిన దొడ్డి కొమురయ్య నేటి తరానికి ఆదర్శమన్నారు. బీసీ సంక్షేమ సంఘం నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల స్వామి వివేక్‌ పటేల్‌, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి కర్రె కుమారస్వామి, సర్పంచ్‌ గుంటి బాపు, ఉపసర్పంచ్‌ తొంటి మధుకర్‌, సామాజిక కార్యకర్త కోమటిపల్లి రాజేందర్‌ నేత పాల్గొన్నారు.

అక్రమ కేసులు నమోదు చేస్తారా?

పెద్దపల్లి: ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలపైనే అక్రమ కేసులు నమోదు చేసి రాజకీయ నాయకులకు అండగా ఎలా నిలుస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ ప్ర శ్నించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద శు క్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. రాఘవపూర్‌లోని శ్మశానవాటిక వద్ద సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని ముందస్తు సమాచారం ఇచ్చిన తమ పార్టీ నాయకులు అశోక్‌, నవీన్‌ను జైలుకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయ డం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు భూపాల్‌, బండ రవికుమార్‌, శోభన్‌, ముత్యంరావు, రవీందర్‌ పాల్గొన్నారు.

దళారులను నమ్మొద్దు

పెద్దపల్లి: వైద్య, విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారులను నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ సూచించారు. అంతేకాకుండా పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయిస్తామనే ఏజెంట్ల మాటలూ నమ్మవద్దని సూచించారు.

కేంద్ర కార్యాలయాన్ని తరలించేదిలేదు

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) కర్మాగారం కార్పొరేట్‌ కార్యాలయం నోయిడా నుంచి రామగుండం తరలించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 16 ఆగస్టు 2025న కేంద్రప్రభుత్వానికి వినతిపపత్రం అందజేశారు. స్పందించిన కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జగత్‌ ప్రకాశ్‌నడ్డా రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారం కార్పొరేట్‌ కార్యాలయాన్ని నోయిడాలోనే కొనసాగిస్తామని వివరణ ఇచ్చారు. ఆర్‌ఎఫ్‌సీఎఫ్‌ ప్లాంట్‌ హెడ్‌, మె కానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌, ఫైనాన్స్‌ విభాగం అధికారులు రామగుండంలోనే ఉంటారని బదులిచ్చారు. నోయిడాలోని కార్పొరేట్‌ కార్యాలయం ఎరుగ శాఖ ప్రమోటర్లు ఈక్విటీ భాగస్వాములతో సమన్వయం చేసుకోవడానికి, ఢిల్లీలో చట్టపరమైన మధ్యవర్తిత్వ విషయాలను నిర్వహించడానికి అత్యంత అవసరమని మంత్రి వివరించారు.

సెప్టిక్‌ ట్యాంక్‌లు శుభ్రం చేయించండి

నోటిఫికేషన్‌ జారీ చేసిన రామగుండం బల్దియా కమిషనర్‌

కోల్‌సిటీ(రామగుండం): ప్రతీ సెప్టిక్‌ ట్యాంక్‌ను మూడేళ్లకోసారి తప్పనిసరిగా శుభ్రం చేయించాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ సూచించారు. ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేశారు. ప్రొ హిబిషన్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ యాస్‌ మా న్యూవల్‌ స్కావెంజర్స్‌ అండ్‌ దెయిర్‌ రిహాబిలిటేషన్‌(పీఈఎంఎస్‌ఆర్‌) చట్టం–2013 ప్రకా రం సెప్టిక్‌ ట్యాంక్‌లోకి మనుషులు ప్రవేశించి శుభ్రం చేయడం నిషేధించారని గుర్తుచేశారు. సెప్టిక్‌ టాంక్‌ శుభ్రం చేసే సేవలు పొందడానికి టోల్‌ ఫ్రీ నంబరు 14420 లేదా, కాల్‌సెంటర్‌ నంబరు 93924 83959కు ఫోన్‌ లేదా వా ట్సాప్‌ సందేశం ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించరు. సెప్టిక్‌ ట్యాంకుల రూపకల్పన, నిర్మాణం, ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ‘ఐఎస్‌ 2470’ ప్రకారం చేపట్టాలని కమిషనర్‌ తెలిపారు. నగరవాసులు, మేషన్లు, కాంట్రాక్టర్లు ఈ నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని నోటిఫికేషన్‌లో ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement