శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం

Apr 4 2026 9:49 AM | Updated on Apr 4 2026 9:49 AM

ముత్తారం: దివంగత అసెంబ్లీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శ్రీపాద ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పుష్పగిరి కంటి ఆస్పత్రి శుక్రవారం ఉచిత కంటివైద్య, శస్త్రచికిత్స శిబిరం ఏర్పాటు చేసింది. టీ పీసీపీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల ఽశ్రీనుబాబు, డీసీపీ రాంరెడ్డి, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌తో కలిసి క లెక్టర్‌ శుక్రవారం శిబిరం ప్రారంభించారు. అనంత రం మాట్లాడుతూ, సర్పంచ్‌ నుంచి శాసనసభ స్పీక ర్‌ వరకు ఎదిగిన శ్రీపాదరావు నమ్ముకున్న సిద్ధాతా లకు కట్టుబడి సేవలు అందించారన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా మారుమూల ప్రాంతాల పేద ల కోసం ఉచిత కంటి వైద్యపరీక్షలతోపాటు శస్త్రచికిత్సలు అందించేందుకు దుద్దిళ్ల కుటుంబం ముందు కు రావడం అభినందనీయమన్నారు. తండ్రి బాట లో తనయులు శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు సమాజ సేవ చేపట్టడం ప్రశంసనీయమన్నారు.

మంథని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం

సుమారు 40 ఏళ్లుగా తమను నమ్ముకుని అధికారం ఇస్తున్న మంథని ప్రజలకు సేవచేయడం తమ దు ద్దిళ్ల కుటుంబం లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యద ర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. తమ తండ్రి శ్రీపాదరావు ఆశయ సాధన కోసం సంక్షేమ పథకాల ఫ లాలను పేదలకు అందిస్తామని తెలిపారు. తొలిరో జు 1,030 కంటి పరీక్షలు చేయగా.. అందులో 300 మందికి కళ్లద్దాలు, 250 మందిని శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. శనివారం కూడా ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, సీఐలు రాజు, ప్రసాద్‌రావు, ఎ స్సై రవికుమార్‌, పుష్పగిరి కంటి వైద్యుడు ప్రదీప్‌, ఆప్తాలిక్‌ వేణుబృందం, సందరవేన మహేందర్‌ యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు అన్నయ్యగౌడ్‌, రాజాబాబు, డీసీసీ ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్‌మోహన్‌రావు, కమాన్‌పూర్‌ ఏఏంసీ చైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ వైనాల రాజు, మద్దెల రాజయ్య, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్‌ బియ్యని శివకుమార్‌, నాయకులు తూటి రఫీ, బోల్నేనేని బుచ్చాంరావు, సుదాడి సంపత్‌రావు, బక్కతట్ల వీనిత్‌, నూనేటి కృష్ణ, కేవీ చారి, తాటిపాముల ఽశంకర్‌, కొల విజయ్‌, అనుము ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

శ్రీపాద ట్రస్టు ఆధ్వర్యంలో వైద్యశిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement