క్రమశిక్షణతో చదువుకోవాలి | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో చదువుకోవాలి

Apr 4 2026 9:49 AM | Updated on Apr 4 2026 9:49 AM

రామగిరి: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్‌ బులుసు విష్ణువర్ధన్‌ సూచించారు. శుక్రవారం సెంటినరీకాలనీ క మ్యూనిటీహాల్‌లో కల్వచర్ల ప్రగతి పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్‌ డేలో మాట్లాడారు. తొలుత టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్‌ అబ్బు కేశవరెడ్డితో కలిసి విద్యార్థులకు ప్రశంసపత్రాలు, జ్ఞాపిక లు అందజేశారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, క్రమశిక్షణ, శ్రద్ధ వంటి లక్షణాలు నేర్పుతూ ఉత్తములుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని ఆయన కోరారు.

జిల్లాస్థాయిలో అద్భుత ప్రతిభ

అంగుళీయ అబాకస్‌ పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రతి భ కనబర్చిన విద్యార్థులకు టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశంసపత్రాలు అందజేశారు. అబాకస్‌ శిక్షణతో పిల్లల్లో జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచన పెరుగుతాయని తెలిపారు. వీరిప్రతిభ భ విష్యత్‌లో గొప్పగణిత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడుతుందని ప్రశంసించారు. పాఠశాల కరస్పాడెంట్‌ అబ్బు కేశవరెడ్డి మాట్లాడుతూ పోటీ ప్ర పంచంలో గణితంపై పట్టు సాధించేందుకు అంగు ళీయ అబాకస్‌ ఒకసంజీవనిలా పనిచేస్తుందన్నారు. తమ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో మెడల్స్‌ సాధించడం గర్వకారణమన్నారు. పాఠశాల ఇన్‌చా ర్జి కొప్పుల గోవర్ధన్‌రావు, అధ్యాపకులు, విద్యార్థు లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

జేఎన్టీయూ ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement