మా డబ్బులిచ్చేయండి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో పరాజయం పాలైన కొందరు అభ్యర్థు లు.. తమకు ఓట్లు వేస్తామని డబ్బులు తీసుకున్న ఓటర్లు మాట తప్పారని ఆగ్రహంతో ఊగిపోతున్నా రు. ‘మాకు ఓటేస్తామని డబ్బులు తీసుకున్నరు.. అ యినా ఓటేయలేదు.. ఓటు మాకే వేశారని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పండి’ అని కొందరు ఓటర్లను నిలదీసినట్లు సమాచారం. కొందరైతే తీసుకు న్న డబ్బులు తిరిగి ఇవ్వాలని బెదిరించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఓటర్లు, ఓటమిపాలైన అ భ్యర్థుల మధ్య గొడవలు చోటుచేసుకుంటుండడంతో పోలీసులు రంగప్రవేశం చేస్తున్నారు.
ప్రమాణాలు చేయాలని ఒత్తిడి
కొందరు పరాజితులు ఏకంగా ఓటర్ల ఇళ్ల వద్దకు వె ళ్లి డబ్బుల కోసం ప్రశ్నించడం, దేవునిపై ప్రమా ణం చేయాలని డిమాండ్ చేయడం వంటి పరిణామాలు కొన్నిడివిజన్లలో చోటుచేసుకున్నాయి. ఒకానొకదశలో ఓటర్లు, అభ్యర్థుల అనుచరుల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. గొడవలు ముదరకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఓటు గోప్యత.. ప్రజాస్వామ్యంలో కీలకం..
ఓటు గోస్యత ఎన్నికల వ్యవస్థలో కీలకసూత్రం. ఓ టువేసిన వ్యక్తిని గుర్తించలేని పరిస్థితుల్లో కూడా కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రశ్నించడం, ప్రమాణాలు చేయించాలని ఒత్తిడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఓటర్లలో భయం, అసహనం కలిగించే ప్రమాదం ఉందని అంటున్నారు.
డబ్బుల రాజకీయాల దుష్పరిణామం
ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రభా వితం చేసేందుకు డబ్బులు పంచడం, ఓటర్లు కూ డా తమకే ఓట్లు వేస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం వంటి పరిణామాలు తీవ్రఆందోళన కలిగిస్తున్నాయి. ఓటు విలువ తెలిసిన ఓటర్లు, మేధావులు ఈ విషరాజకీయ సంస్కృతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నా, ఓటు తమ మనసుకు నచ్చిన అభ్యర్థికే వేయడం ఓటరు హక్కు. అయినా డబ్బులు ఎన్నికల పవిత్రతను దెబ్బతీస్తున్నాయని పేర్కొంటున్నారు.
కఠిన నిబంధనలపై ఆశలు
మారుతున్న రాజకీయ ధోరణులకు చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు అమలు చే యాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. డబ్బులు పంచే అభ్యర్థులపై కఠిన చర్యలు, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలపై కట్టడి, ఫలితాల అనంతరం ఓటర్లను బెదిరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యంపై విశ్వాసం పెరుగుతుందని సూచిస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి ముప్పు
ఓటర్లను బెదిరించడం, ప్రమాణాలు చేయించడం వంటి చర్యలు ప్రజాస్వామ్యంపై నమ్మకం దెబ్బతీ స్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎ న్నికలు పూర్తయ్యాక ఫలితాలను గౌరవించడం, ప్రజాతీర్పును అంగీకరించడం ప్రజాస్వామ్య స్ఫూ ర్తి అని సామాజికవర్గాలు అంటున్నాయి. అధికారు లు అప్రమత్తంగా ఉండి ఓటర్ల భద్రతకు ప్రాధా న్యం ఇవ్వాలని నగరవాసులు కోరుతున్నారు.


