ప్రవర్తనా నియమావళి పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రవర్తనా నియమావళి పాటించాలి

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

ప్రవర్తనా నియమావళి పాటించాలి

ప్రవర్తనా నియమావళి పాటించాలి

జ్యోతినగర్‌(రామగుండం): అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనానియమావళిని పాటించాలని అదనపు కలె క్టర్‌, రామగుండం కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ కోరారు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సందేహాల నివృత్తి కోసం రిటర్నింగ్‌ అధికారులు, బల్దియా కార్యాలయంలోని ఎన్నికల సెల్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రచార వాహనాలకు అనుమతి పొందాలని, అనుమతి పత్రాన్ని మా త్రమే అంటించాలని సూచించారు. ఎన్నికల వ్యయ పరిమితి రూ.1.50 లక్షలకు మించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రమేశ్‌ తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి అన్నారు. ట్రైనర్లు స్వరూప్‌ చంద్‌, శ్రీనివాస్‌.. అభ్యర్థులు అనురించాల్సిన ప్రవర్తనా నియమావళిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఎన్నికల పరిశీలకురాలు పద్మజారాణి, వ్యయ పరిశీలకులు సుజాత, కృష్ణమోహన్‌, రవిబాబు, బల్దియా అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, శ్రీహరి, నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement