బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం నమ్మవద్దు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం నమ్మవద్దు

Feb 7 2026 2:58 PM | Updated on Feb 7 2026 2:58 PM

బీఆర్‌ఎస్‌ తప్పుడు   ప్రచారం నమ్మవద్దు

బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం నమ్మవద్దు

రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని: కాంగ్రెస్‌పార్టీపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఖండించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ కోరారు. నగరంలోని పవర్‌ హోస్‌నగర్‌, గంగానగర్‌ కాలనీల్లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లలో ఎమ్మెల్యే సమాట్లాడారు. రోడ్డు వెడల్పు చేస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. నగరంలో ఇంత పెద్దరోడ్డు ఎక్కడా లేదని తెలిపారు. రోడ్డు విస్తరించే ఆలోచన తమకు లేదని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపుతోనే ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి సా ధిస్తుందని, కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజార్టితో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement